• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

hantavirus: ఎలుకల ద్వారా వ్యాప్తి.. కరోనా కన్నా డేంజరస్ హంటా.. మరణశయ్యపై 32 మంది..

|

కష్టాలన్నీ కూడబలుక్కుని ఒకేసారి మీదపడతాయన్నట్లు.. మానవాళి మనుగడకు మరిన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచాన్ని గజగజలాడిస్తోన్న కరోనా వైరస్ మంగళవారం నాటికి 17వేల మందిని పొట్టనపెట్టుకుంది. మరో నాలుగు లక్షల మంది వైరస్ బారినపడి ప్రాణాలు నిలుపుకునేందుకు పోరాడుతున్నారు. ఈ సందులోనే స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్ల్యూ లాంటి కేసులు కూడా నమోదయ్యాయి. ఇవి చాలదన్నట్లు 67 ఏళ్ల కిందటి హంటావైరస్ మళ్లీ జూలు విదిల్చింది. విచిత్రంగా కరోనా పుట్టిన చైనాలోనే ఈదఫా హంటా వైరస్ మరణం సంభవించడం గమనార్హం.

 అసలేం జరిగిందంటే..

అసలేం జరిగిందంటే..

నైరుతి చైనాలోని యునాన్ ఫ్రావిన్స్ కు చెందిన ఓ 39ఏళ్ల వ్యక్తి.. దేశ తూర్పు తీరంలోని షాండాంగ్ ప్రొవిన్స్‌కు బస్సులో వెళ్తుండగా అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. కరోనా కాలం కావడంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ వ్యక్తికి టెస్టులు నిర్వహించగా, హంటావైరస్ కారణంగా చనిపోయినట్లు నిర్ధారించారు. అతనితోపాటు బస్సులో ప్రయాణించిన మరో 32 మందికి కూడా హంటా లక్షణాలు బయటపడటంతో వాళ్లందరినీ హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. కరోనాలాగే హంటా వైరస్ కు కూడా ఇప్పటిదాకా మందు లేకపోవడం భయాలను మరింత రెట్టింపు చేసింది.

కరోనా కన్నా డేండర్

కరోనా కన్నా డేండర్

మనుగడ రీత్యా పాతదే హంటా వైరస్ కొత్తదేమీ కానప్పటికీ మనుషుల్ని చంపడంలో మాత్రం నిర్దయగా వ్యవహరిస్తుంది. వైరస్ వ్యాప్తితో పోల్చుకుంటే కరోనా మరణాల రేటు కేవలం 2 శాతంకాగా, హంటా మరణాల రేటు మాత్రం 38 శాతం ఉంటుంది. కరోనా లాగా ఉపరితాన్ని తాకితేనో, గాలి ద్వారానో కాకుండా.. హాంటావైరస్ ఎలుకల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. నిజానికి ఈ వైరస్ పుట్టింది కూడా ఎలుకల్లోనే అయినప్పటికీ, దాని ప్రభావం మనుషులపైనే ప్రమాదకరంగా ఉంటుంది.

ఎలా వ్యాపిస్తుందంటే..

ఎలా వ్యాపిస్తుందంటే..

హంటా వైరస్ కు ప్రధాన వాహకాలు ఎలుకలే. మన ఇంట్లో, ఇంటి పరిసర ప్రాంతాల్లో, డ్రైనేజీలు, నాలాలు ఉండే మార్గాల్లో ఎలుకలు ఉంటే హాంటావైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రఖ్యాత సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీపీ) స్పష్టం చేసింది. పొరపాటున మనం ఎలుకల మలమూత్రాలు, లాలాజలం లేదా వాటి వ్యర్థాలు తాకిన తర్వాత.. అవే చేతులతో కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోవడం ద్వారా వైరస్ మన ఒంట్లోకి వెళుతుంది. దీని ద్వారా కలిగే జబ్బును హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్(హెచ్‌పీఎస్) అని పిలుస్తారు. చాలా అరుదైన కేసుల్లో మాత్రమే మనిషి నుంచి మనిషికి నేరుగా సంక్రమిస్తుందీ వైరస్.

లక్షణాలు.. చికిత్స..

లక్షణాలు.. చికిత్స..

హంటా వైరస్ ద్వారా హంటావైరస్ పల్మనరీ సిండ్రోమ్(హెచ్‌పీఎస్) జబ్బుకు గురయ్యే రోగుల్లో.. తీవ్రమైన తలనొప్పి, జ్వరం, కడుపునొప్పి, కండరాల నొప్పులు, వాంతులు, విరేచనాలు లాంటి లక్షణాలుంటాయి. వ్యాధి తీవ్రత పెరిగేకొద్దీ ఊపిరితిత్తుల్లో కఫం ఎక్కువై, శ్వాస పీల్చుకోవడం ఇబ్బందిగా మారుతుంది. కొన్ని సార్లు కిడ్నీ ఫెయిల్యూర్ కు కూడా దారితీస్తుంది. ఇప్పటిదాకా 21 రకాల హంటా వైరస్ లను గుర్తించిన సైంటిస్టులు.. దీనికి విరుగుడు మందు మాత్రం కనిపెట్టలేకపోయారు. వ్యాక్సిన్ లేకపోవడం ప్రజల్లో భయాందోళనలు పెరగడానికి ప్రధాన కాణమయింది. అయితే పాజిటివ్ పేషెంట్లలో రోగనిరోధక శక్తిని పెంచుతూ, వైరస్ ప్రభావాన్ని దూరం చేయడమొక్కటే ప్రస్తుతానికి అదుబాటులో ఉన్న చికిత్సా విధానం.

ఇండియాలోనూ మరణాలు..

ఇండియాలోనూ మరణాలు..

1950-53 మధ్య జరిగిన అమెరికా-కొరియా యుద్ధం సమయంలో మొదటిసారి ఈ వైరస్ వ్యాప్తిలోకి వచ్చింది. హంటాన్ నది(ప్రస్తుతం సౌత్ కొరియాలో ఉంది) తీరంలో అమెరికా సైనికులు ఎలుకల కాటుకు గురై ఈ వ్యాధిబారిన పడ్డారు. అలా దీనికి హంటా వైరస్ అని పేరుపడింది. కాలక్రమంలో దాదాపు ప్రపంచ దేశాలన్నింటికీ విస్తరించిన ఈ మహమ్మారి.. 1993లో అమెరికాలో జూలు విదిల్చింది. 2017 నాటికి అక్కడ 728 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మన దేశానికి వస్తే, 2008లో నీలగిరి కొండల్లో నివసిస్తూ, పాములు ఆడించే కొన్ని కుటుంబాల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు. 2012లో ముంబైలో ఓ 12 ఏళ్ల బాలుడు హంటా వైరస్ బారినపడి చినిపోయినట్లు రికార్డులున్నాయి. అమెరికాలో దీన్ని ‘న్యూ వరల్డ్' హంటా వైరసెస్ అని పిలుస్తుండగా.. యూరప్, ఆసియాలో ‘ఓల్డ్ వైరస్' హంటా వైరసెస్‌గా పిలుస్తారు.

English summary
Even as the coronavirus outbreak takes the world by storm, Now, a man from China has tested positive for hantavirus. All you need to know about the virus, and how it spreads
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X