వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నిర్లక్ష్యం ఖరీదు: మృతదేహం చెత్త బండిలో తరలింపుపై చర్యలు, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది సస్పెండ్...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ పుణ్యాన మనుషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. అంతకుముందు కొంచెమైనా మనుషుల్లో జాలీ కనిపించేది. కానీ ఇప్పుడు వ్యాధిగ్రస్తులను పురుగుల్లా చూస్తున్నారు. యూపీ బలరాంపూర్ జిల్లా మున్సిపాలిటీలో హృదయ విదారకర ఘటన జరిగింది. సహజ్‌పురకు చెందిన మహ్మద్ అన్వర్ బుధవారం రాత్రి అస్వస్థతకు గురయ్యాడు. మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట కుప్పకూలిపోయాడు.

Lockdown: హే హే హేయ్, ఢాం ఢూం జాతర, నాతొక్కాలో కరోనా, ఎడ్ల బండి పోటీలు, వేలాది మంది ! Lockdown: హే హే హేయ్, ఢాం ఢూం జాతర, నాతొక్కాలో కరోనా, ఎడ్ల బండి పోటీలు, వేలాది మంది !

అస్వస్థతతో చనిపోయిన అన్వర్‌కు అంతకుముందు వైద్య సాయం అందించేందుకు ఒక్కరు ముందుకురాలేదు. కానీ చనిపోయాక మాత్రం దగ్గరికీ వచ్చారు. వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సింది పోయి.. మృతదేహాన్ని మున్సిపాలిటీ చెత్తబండిలో తరలించారు. అలా తరలిస్తుండగా కొందరు వీడియో తీశారు. ఆ దృశ్యం మనస్సున ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది. నలుగురు మున్సిపల్ సిబ్బంది చెత్త బండీలో మృతదేహాం వేయగా.. పక్కనే ముగ్గురు పోలీసులు కూడా ఉన్నారు.

Man Dies Outside UP Govt Office, Body Dumped in Garbage Van; 7 Suspended

Recommended Video

అవినీతి చేసిన ఎవ్వరినీ వదలము.. RK ROJA వార్నింగ్

ఆ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో అధికారులు స్పందించారు. మృతదేహాన్ని తరలించిన నలుగురు మున్సిపల్ సిబ్బంది, చేష్టలుడిగి చూస్తున్న ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది. ఇందులో బలరాంపూర్ ఎస్సై ఒకరు ఉండగా.. మిగిలిన ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. ఆ మృతదేహాన్ని కూడా పట్టుకునేందుకు సిబ్బంది ఇష్టపడలేదు అని స్థానికులు తెలిపారు. కరోనా వైరస్ వల్ల దూరంగా ఉండగా, నెటిజన్లు మాత్రం ట్రోల్ చేస్తున్నారు. నెటిజన్లు ఏకీపారేయడంతో పోలీసు ఉన్నతాధికారులు స్పందించి.. చర్యల తీసుకున్నారు. సస్పెన్షన్ వేటు వేశారు. ఘటనపై విచారణ జరిపిస్తున్నామని చెబుతున్నారు. నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని స్పష్టంచేశారు.

English summary
Uttar Pradesh Balrampur district municipal authority employees, surrounded by police personnel, dumped a dead body into a garbage van before it was taken away.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X