వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో: రైల్వేస్టేషన్ ప్లాట్ ఫాంపై పరుగులు తీసిన ఆటో..కారణం తెలిస్తే షాక్!

|
Google Oneindia TeluguNews

ముంబై: రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై ఓ ఆటోరిక్షా పరుగులు తీసిన ఘటన ముంబైలోని విరార్ వెస్ట్ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకుంది. నొప్పులు పడుతున్న ఓ గర్భిణిని సకాలంలో ఆసుపత్రికి చేర్చడానికి ఓ ఆటోడ్రైౌవర్ చేసిన సాహసం అది. అనూహ్యంగా రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపైకి దూసుకొచ్చిన ఆటోను చూసి ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఆందోళనకు గురయ్యారు. పక్కకు పరుగులు పెట్టారు. అనంతరం అసలు విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఆటో డ్రైవర్ ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

<strong>బంగాళాఖాతంలో అల్పపీడనం: పొంచివున్న తుఫాను ముప్పు! </strong>బంగాళాఖాతంలో అల్పపీడనం: పొంచివున్న తుఫాను ముప్పు!

విరార్ వెస్ట్ ప్రాంతంలో నివసిస్తోన్న ఓ గర్భిణీకి పురిటి నొప్పులు ఆరంభం అయ్యాయి. దీనితో భర్త ఆమెను తీసుకుని రైలులో ఆసుపత్రికి బయలుదేరారు. కొద్దిరోజులుగా ఏకధాటిగా కురుస్తున్న వర్షాల వల్ల పట్టాలపై వరదనీరు చేరుకుంది. ఫలితంగా- రైలును విరార్ స్టేషన్ లోనే నిలిపివేశారు. మరోవైపు- ఆ గర్భిణీకి పురిటి నొప్పులు తీవ్రతరం అయ్యాయి. దీనితో దిక్కుతోచని స్థితిలో పడ్డ ఆమె భర్త స్టేషన్ బయటికి వెళ్లి ఆటోను మాట్లాడాడు. రైలు నుంచి కిందికి దిగి, స్టేషన్ బయటికి కూడా రాలేని పరిస్థితిలో ఆ గర్భిణి చేరుకోవడంతో.. ఆటో డ్రైవర్ సాగర్ కమ్లాకర్ గవద్ ఈ సాహసానికి పూనుకున్నాడు,

Man Drives Auto On Mumbai Railway Platform To Help Woman In Labour, Charged

ఆటోను ప్లాట్ ఫాంపైకి తీసుకెళ్లాడు. గట్టిగా హారన్ కొడుతూ ఆమె ఉన్న బోగీ వైపునకు వెళ్లాడు. గర్భిణీని ఎక్కించుకుని.. సమీపంలోని సంజీవనీ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. సకాలంలో ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఇదిలావుండగా- రైల్వే భద్రతా బలగాలు (ఆర్పీఎఫ్) సాగర్ కమ్లాకర్ పై కేసు నమోదు చేశారు. ప్రైవేటు వాహనాలు ప్లాట్ ఫాంపైకి రాకూడదంటూ అతణ్ని అరెస్టు చేశారు. అనంతరం అతణ్ని రైల్వే కోర్టులో హాజరు పరిచారు. సాగర్ ను అరెస్టు చేయడానికి గల కారణాలను తెలుసుకున్న న్యాయమూర్తి.. ఆయనను ప్రశంసించారు. వెంటనే విడిచి పెట్టాలని ఆర్పీఎఫ్ సిబ్బందిని ఆదేశించారు.

English summary
In a humanitarian gesture, an autorickshaw driver in Mumbai drove his vehicle on to the Virar railway station platform to help a woman who went into premature labour. The driver was identified as Sagar Kamlakar Gawad, 34, a resident of Dongarpada in Virar (West). According to police, the incident occurred on Sunday morning when a seven-months pregnant woman and her husband were travelling in the compartment reserved for disabled persons. Due to delay in services caused by incessant rains in the area, the train had halted at the station when the woman started developing labour pain.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X