వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెస్టారెంట్ సాంబార్‌లో బల్లి... షాక్ తిన్న కస్టమర్... వీడియో వైరల్...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలోని ప్రముఖ రెస్టారెంట్ శరవణ భవన్‌లో భోజనం చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. రెస్టారెంట్ సిబ్బంది వడ్డించిన సాంబార్‌లో చనిపోయిన బల్లిని చూసి అతను కంగు తిన్నాడు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

Recommended Video

#WATCH : తల్లి ప్రేమ.. దుండగుల నుండి ఒంటి చేత్తో బిడ్డను కాపాడుకున్న తల్లి! || Oneindia Telugu

వివరాల్లోకి వెళ్తే... పంకజ్ అగర్వాల్ అనే వ్యక్తి ఆదివారం(అగస్టు 2) తన స్నేహితులతో కలిసి ఢిల్లీలోని కన్నౌత్ ప్రాంతంలో ఉన్న శరవణ భవన్‌ రెస్టారెంట్‌కు వెళ్లాడు. అక్కడ సాంబార్ దోశ ఆర్డర్ చేయగా సిబ్బంది తీసుకొచ్చి టేబుల్‌పై పెట్టారు. దోశ కాస్త తిన్నాక... సాంబార్‌లో స్పూన్‌ని అటు,ఇటు అంటుండగా.. అందులో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో పంకజ్,అతని స్నేహితులు షాక్ తిన్నారు.

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా వైరల్‌గా మారింది. ఆ బల్లి శరీరం సగం మాత్రమే అందులో ఉందని... మిగతా సగం మిస్సయ్యిందంటూ ఎవరో కామెంట్ చేయడం వీడియోలో వినిపిస్తోంది. బల్లి శరీరం సగమే అందులో ఉండటంతో... మిగతా సగం వేరే వాళ్ల గిన్నెలోకి వెళ్లిందా... లేక దాన్ని గమనించక పంకజ్ తినేశాడా... అన్నది తెలియలేదు. దీనిపై పంకజ్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదైంది.

Man Finds Dead Lizard in his Sambar at Top Delhi Restaurant, FIR Lodged

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. రెస్టారెంట్ సీసీటీవీ ఫుటేజీని సమర్పించాల్సందిగా యాజమాన్యాన్ని కోరారు. ఆ సాంబార్ వంటకం చేసిన కుక్ వివరాలు,దానికి ఉపయోగించిన పదార్థాలేంటో చెప్పాలని కోరారు. రెస్టారెంట్ లైసెన్స్‌ను కూడా సమర్పించాల్సిందిగా చెప్పారు. శరవణ భవన్‌కు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. భారత్‌లో 39 శరవణ భవన్ ఔట్ లెట్స్ ఉండగా... విదేశాల్లో 87 ఉన్నాయి.

English summary
A man who went to dine out with his friends at Delhi's popular South Indian restaurant, Saravana Bhavan, was in for a rude shock when he discovered a dead lizard in his sambar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X