• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

24 గంటల్లో 1300కి.మీ... ఆక్సిజన్ కోసం ఓ స్నేహితుడి రిస్క్... ప్రాణాలు నిలబెట్టిన దేవుడు...

|

సైకిల్ గర్ల్ జ్యోతి గుర్తుందా... గతేడాది లాక్‌డౌన్ సమయంలో ఢిల్లీ నుంచి బిహార్‌లోని దర్భంగా వరకు 1300కి.మీ సైకిల్‌పై ప్రయాణించిన బాలిక... జబ్బు పడిన తండ్రిని వెనుక సీట్లో కూర్చోపెట్టుకుని ఏడు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ గమ్య స్థానం చేరిన ఆ బాలికపై అప్పట్లో సర్వత్రా ప్రశంసలు వ్యక్తమయ్యాయి. తాజాగా జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడికి ఆక్సిజన్ సిలిండర్ తీసుకొచ్చేందుకు 24 గంటల్లో ఏకంగా 1300 కి.మీ దూరం ప్రయాణించాడు. స్నేహితుడి కోసం ఇంత రిస్క్ చేసిన అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.

ఎవరా వ్యక్తి...

ఎవరా వ్యక్తి...

జార్ఖండ్‌లోని రాంచీకి చెందిన దేవేంద్ర కుమార్ శర్మకు ఈ నెల 24న అతని స్నేహితుడు సంజయ్ సక్సేనా నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన వారి స్నేహితుడు రాజన్‌కు ప్రస్తుతం అత్యవసరంగా ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఘజియాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో ఆక్సిజన్ సపోర్ట్‌పై రాజన్‌కు చికిత్స అందిస్తున్నారని... మరో 24 గంటలకు సరిపోయే ఆక్సిజన్ మాత్రమే ఉందని చెప్పాడు. ప్రస్తుతం ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్లు దొరకట్లేదని... ఉన్న ఆక్సిజన్ అయిపోతే ఆ తర్వాత పరిస్థితి ఏంటని అంతా ఆందోళన చెందుతున్నట్లు తెలిపాడు.

బైక్‌పై బొకారోకి.. అక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్లతో...

బైక్‌పై బొకారోకి.. అక్కడి నుంచి ఆక్సిజన్ సిలిండర్లతో...

సంజయ్ సక్సేనా ఫోన్ పెట్టేయగానే దేవేంద్ర శర్మ బొకారో పట్టణంలోని ఆక్సిజన్ ప్లాంట్‌కి బైక్‌పై బయలుదేరాడు. తీరా అక్కడికి వెళ్లాక ఎక్కడా ఆక్సిజన్ సిలిండర్లు దొరకలేదు. చివరకు తెలిసినవాళ్ల సాయంతో జార్ఖండ్ గ్యాస్ ప్లాంట్ యజమాని రాకేశ్ గుప్తాను ఫోన్ ద్వారా సంప్రదించాడు. రాకేశ్ దేవేంద్ర శర్మకు ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడమే కాదు... అందుకు ఎలాంటి డబ్బు కూడా తీసుకోలేదు. దేవేంద్ర శర్మ వెంటనే ఆ సిలిండర్లు తీసుకుని ఘజియాబాద్ బయలుదేరాలనుకున్నాడు. అయితే బైక్‌పై సిలిండర్లు పట్టుకుని అంత దూరం సాధ్యం కాదు కాబట్టి... తెలిసిన స్నేహితుడి నుంచి కారు తీసుకున్నాడు.

24 గంటల్లో 1300కి.మీ దూరం...

24 గంటల్లో 1300కి.మీ దూరం...

అలా అదే రోజు రాత్రి కారులో ఘజియాబాద్‌ బయలుదేరాడు. 24 గంటల్లో ఏకధాటిగా 1300కి.మీ దూరం ప్రయాణించి ఎట్టకేలకు ఘజియాబాద్‌లో రాజన్ చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నాడు. సకాలంలో రాజన్‌కు ఆక్సిజన్ అందడంతో అతని ప్రాణాలు నిలబడ్డాయి. దీంతో రాజన్ కుటుంబ సభ్యులు దేవేంద్ర శర్మకు కృతజ్ఞతలు తెలియజేశారు. స్నేహితుడి కోసం రిస్క్ చేసి మరీ ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్లిన అతనిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. అంతకు కొద్దిరోజుల ముందే రాజన్,దేవేంద్రల సోదరుడు సంజీవ్ కోవిడ్‌తో చనిపోవడం గమనార్హం.

సైకిల్ గర్ల్ జ్యోతి గుర్తుందా...

సైకిల్ గర్ల్ జ్యోతి గుర్తుందా...

గతేడాది బిహార్‌కి చెందిన జ్యోతి అనే బాలిక వారం రోజుల పాటు 1300కి.మీ దూరం సైకిల్ తొక్కి తమ స్వస్థలానికి చేరుకున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆ బాలిక,అతని తండ్రి ఢిల్లీలోని గురుగ్రామ్‌లో చిక్కుకుపోయారు. కొద్దిరోజుల క్రితమే తండ్రి రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. గురుగ్రామ్‌లోనే ఉంటే ఇంటి అద్దె చెల్లించలేక... తిండి కూడా దొరక్క దుర్భర జీవితం గడపాల్సి వస్తుందని ఆ బాలిక ఆందోళన చెందింది. వెంటనే తండ్రిని సైకిల్ వెనుక సీట్లో కూర్చోపెట్టుకుని గురుగ్రామ్ నుంచి దర్భాంగకు బయలుదేరింది. అలా ఏడు రోజుల పాటు సైకిల్ తొక్కుతూ ఎట్టకేలకు స్వస్థలానికి చేరింది. జ్యోతి సాహసానికి అప్పట్లో అంతర్జాతీయంగానూ ప్రశంసలు కురిశాయి. అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ కూడా జ్యోతి సాహసాన్ని అభినందించారు.

  Ys Jagan యాక్షన్ కి లోకేష్ రియాక్షన్ | విద్యార్థుల భవిష్యత్తుకి సీఎం భరోసా || Oneindia Telugu
  English summary
  Devendra Sharma undertook a 24-hour journey, covering 1,300 kms from Ranchi to Ghaziabad, to deliver oxygen cylinders to his friend Rajan, who had tested positive for Covid-19. Rajan had oxygen supply left for just one more day when Devendra travelled all the way to Ghaziabad to save his life.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X