భార్య పోలీస్ డ్రస్ గర్ల్‌ఫ్రెండ్‌కు ...అనంతరం జనాల వద్ద దోపిడి...!
తన భార్య పోలీస్ యూనిఫాంతో ఓ భర్త దోపిడికి తెగపడ్డాడు. పోలీసు అధికారి అయిన తన భార్య యూనిఫామ్‌ను ఏకంగా గర్ల్‌ఫ్రెండ్‌కు ఇవ్వడంతోపాటు ఓ ఫేక్ పోలీస్ ఐడీ కార్డును సైతం సృష్టించాడు. దీంతో ప్రజల్ని బెదిరించి డబ్బులు దోచుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకు పంపారు.
మధ్యప్రదేశ్‌లోని చెందిన ఓ వ్యక్తి భార్య పోలీసు శాఖలో ఇన్స్పెక్టర్గా సేవలందిస్తోంది. అయితే భార్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని సులువుగా డబ్బు నొక్కేయాలన్న ఆలోచన సదురు భర్తకు కలిగింది. వెంటనే అతడు రంగంలోకి దిగాడు. తన గర్ల్‌ఫ్రెండ్‌ను కూడా రంగంలోకి దింపాడు. భార్య యూనిఫాంను గర్ల్ ఫ్రెండ్‌కు ఇచ్చాడు. దాని సహాయంతో సదరు గర్ల ఫ్రండ్ పోలీసు అధికారిగా నటిస్తూ జనాల్ని బెదిరించి డబ్బు దోచుకునేది. వచ్చిన డబ్బుతో ఇద్దరూ జల్సా చేసేవారు. అయితే విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దొంగ ఐడీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. కాగా కేసు పోలీస్ డిపార్ట్మెంట్కు సంబంధించింది కావడంతో వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచారు.