వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జంబలకిడిపంబ : జ్వరంతో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తి .. కడుపుతో ఉన్నాడని తేల్చిన ల్యాబ్ రిపోర్ట్..

|
Google Oneindia TeluguNews

భిండ్ : మధ్యప్రదేశ్‌లో ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. జ్వరం వచ్చిందని హాస్పిటల్‌కు వెళ్లిన ఆయనకు బ్లడ్ టెస్ట్ చేసిన ఓ ల్యాబ్ షాకిచ్చింది. పేషెంట్ గర్భంతో ఉన్నాడని రిపోర్ట్ ఇవ్వడంతో అవాక్కైన సదరు వ్యక్తి సంబంధిత అధికారులకు కంప్లైట్ చేశాడు. దానిపై స్పందించిన అధికారులు అనుమతి లేకుండా నడుస్తున్న ల్యాబ్‌ను సీజ్ చేసి విచారణ జరుపుతున్నారు.

భార్యను కిడ్నాప్ చేశారని స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే..?భార్యను కిడ్నాప్ చేశారని స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే..?

మధ్యప్రదేశ్ భిండ్ జిల్లాలోని పూప్ గ్రామానికి చెందిన సురేశ్ జాదవ్ మూడు నెలలుగా జ్వరంతో బాధపడుతున్నాడు. ఎన్ని మందలు వాడినా ఫలితం లేకపోవడంతో ఆయనకు ట్రీట్‌మెంట్ చేసిన డాక్టర్ మలేరియా ఉందేమోనని అనుమానించాడు. బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని దగ్గరలోని శ్యామ్ పాథాలజీ సెంటర్‌కు పంపాడు. అక్కడ రక్త నమూనాలు సేకరించిన సిబ్బంది మరుసటి రోజు రిపోర్టు ఇస్తామని చెప్పారు.

Man Handed Blood Report Declaring Him Pregnant

మరుసటి రోజు ల్యాబ్ రిపోర్టులు తీసుకున్న జాదవ్ డాక్టర్ దగ్గరకు వెళ్లాడు. ఆ రిపోర్టు చూసిన జాదవ్ షాకయ్యాడు. శ్యామ్ పాథాలజీ సెంటర్ ఇచ్చిన రిపోర్టులో తాను గర్భంతో ఉన్నానని ఉండటంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. తప్పుడు రిపోర్టు ఇచ్చిన ల్యాబ్‌పై డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌కు కంప్లైంట్ చేశాడు. అధికారులు ఎంక్వైరీ ఆదేశించడంతో శ్యామ్ పాథాలజీ ల్యాబ్ నిర్వహకులు బిచాణా ఎత్తేశారు. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో అధికారులు ల్యాబ్‌ను సీజ్ చేసి కేసు నమోదుచేశారు. జిల్లాలో అనుమతుల్లేని ఇలాంటి ల్యాబ్‌లు పెద్ద సంఖ్యలో ఉన్నాయని గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. నిర్వాహకులపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.

English summary
In a shocking incident from Madhya Pradesh's Bhind district, a man was handed over a blood report by a private pathology lab which declared him pregnant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X