వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిల ఫోటోలతో వ్యాపారం: ఫేస్‌బుక్‌తో జర భద్రం..నిందితుడు అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ముంబై: అమ్మాయిల పేర్లతో ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను క్రియేట్ చేసి ఆపై వెబ్‌ క్యామ్ ద్వారా సెక్స్ సర్వీసులు అందిస్తామని చెప్పి మోసం చేస్తున్న వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అమ్మాయిలతో కూడిన ఫేక్ ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ను కస్టమర్లుకు ఎరగా వేసి వారు డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయగానే వారిని ఫేస్‌బుక్‌పై బ్లాక్ చేసేవాడు ఈ ఘరానా మోసగాడు.

కుక్కంటే ప్రాణం: వెతికిచ్చిన వారికి ఈ అమ్మాయి భారీ ఆఫర్..అద్దెకు విమానం కూడా..!కుక్కంటే ప్రాణం: వెతికిచ్చిన వారికి ఈ అమ్మాయి భారీ ఆఫర్..అద్దెకు విమానం కూడా..!

 ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా అమ్మాయిల ఫోటోలు

ఫేస్‌బుక్ ప్రొఫైల్‌గా అమ్మాయిల ఫోటోలు

పోలీసుల కథనం ప్రకారం ఈ ఘరానా మోసగాడు ఓ ఈవెంట్ మేనేజర్‌‌ను మోసం చేశాడు. ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయి ఫోటో పెట్టి ఎరవేశాడు. అయితే ఆ అమ్మాయి నిజంగానే ఈవెంట్ మేనేజర్‌కు స్నేహితురాలు కావడంతో అసలు విషయం వెలుగు చూసింది. వెంటనే బాధిత మహిళ తన భర్తతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఘరానా మోసగాడిని అరెస్టు చేసి విచారణ చేయగా మొత్తం వివరాలను కక్కాడు.

 40 నిమిషాల నగ్నత్వం కోసం రూ.1000 ఛార్జ్ చేసేవాడు

40 నిమిషాల నగ్నత్వం కోసం రూ.1000 ఛార్జ్ చేసేవాడు

40 నిమిషాల పాటు వెబ్‌క్యామ్ ద్వారా నగ్నత్వాన్ని ప్రదర్శిస్తారు అని చెప్పి పోస్టు పెట్టేవాడని ఇందుకోసం రూ. 1000 చార్జ్ చేసేవాడని చెప్పారు. ఒక్కసారి రూ. 1000 ఖాతాలోకి ట్రాన్స్‌ఫర్ కాగానే అవతల కస్టమర్‌ను బ్లాక్ చేసేవాడని పోలీసులు చెప్పారు. ఇక 20 నిమిషాల న్యూడ్ వీడియో కాల్‌కు రూ. 1500 వసూలు చేసేవాడని పోలీసులు చెప్పారు.

 తెలివిగా పట్టుకున్న సైబర్ క్రైమ్ నిపుణుడు

తెలివిగా పట్టుకున్న సైబర్ క్రైమ్ నిపుణుడు

పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు ఓ సైబర్ క్రైమ్ నిపుణుడు శుభంసింగ్‌ని భార్యభర్తలు సంప్రదించినట్లు చెప్పారు. కస్టమర్‌లా నటించిన శుభం సింగ్ మోసగాడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. సాధారణంగా మొబైల్ వాలెట్స్ ద్వారానే డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయాలని నిబంధనలు పెట్టగా ఆ మోసగాడిని పట్టుకునేందుకు తన బ్యాంకు ఖాతా వివరాలను అడిగినట్లు శుభం సింగ్ చెప్పారు. అయితే ఎంతకీ ఇవ్వకపోవడంతో ఆ మోసగాడిని ఒప్పించి తన బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నట్లు శుభం సింగ్ వివరించారు.

 నిందితుడిని పట్టించిన బ్యాంక్ ఖాతా వివరాలు

నిందితుడిని పట్టించిన బ్యాంక్ ఖాతా వివరాలు

ఒక్కసారిగా బ్యాంకు ఖాతా వివరాలు తెలుసుకోగానే వివరాల ఆధారంగా పోలీసుల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ నెంబర్ లింక్ అయి ఉండటంతో అడ్రస్ కనుక్కోవడం మరింత సులభమైందని పోలీసులు తెలిపారు. అయితే తమ విచారణలో మూడు ఫేక్ ఫేస్‌బుక్ అకౌంట్స్‌ను నిందితుడు ఆపరేట్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇలాంటి సైబర్ నేరగాళ్ల నుంచి జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఎదురైతే చాలా తెలివిగా వ్యవహరించాలని వారు ప్రజలకు సూచిస్తున్నారు.

English summary
A man was arrested earlier this week for allegedly creating fake Facebook profiles of women offering webcam sex services. Impersonating these women, the man would extract money from customers and block them on Facebook, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X