వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒళ్లు మండి.. లోదుస్తులపై జయలలిత ఫోటో: ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఫోటోను లోదుస్తుల పైన వేసినందుకు ఓ టెక్స్‌టైల్ దుకాణ యజమానిని కారైకుడి పోలీసులు అరెస్టు చేశారు. అతను జయలలిత ఫోటోను లోదుస్తుల పైన అతికించి, దానిని వాట్సాప్ ద్వారా స్నేహితులకు పంపించాడు.

సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఫొటోను లోదుస్తులపై ముద్రించడంతో అందరూ అవాక్కయ్యారు. కారైకూడిలో శరవణన్ అనే వ్యక్తి ఓ టెక్స్‌టైల్స్ దుకాణాన్ని నడుపుతున్నాడు. లోదుస్తులపై ముఖ్యమంత్రి జయలలిత ఫొటోలను ముద్రించి వాటి ఫొటోలను స్నేహితులకు పంపించాడు.

Man held for indecent use of CM's photo

ఈ విషయం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ నేతలు అతని పైన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నాడీఎంకే టౌన్ సెక్రటరీ ఎస్ మీయప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సెక్షన్ల కింద శరవణ పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు అతనిని విచారించారు. ఈ విచారణలో ఆసక్తికర విషయం బయటపడింది. చెన్నై వరద బాధితులకు అందించే సాయం పైన జయలలిత ఫొటో ఉండాలని అన్నాడీఎంకే కార్యకర్తలు పట్టుబట్టినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఒళ్లు మండిన శరవణన్ ఈ పని చేశాడు. శరవణన్ చేసిన పనికి, రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేదని పోలీసులు తెలిపారు.

English summary
The Karaikudi police have arrested a textile shop owner for pasting a picture of Chief Minister Jayalalithaa on an undergarment and sending a picture of it to his friends on WhatsApp.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X