వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వామ్మో.. పల్లిలో కరెన్సీ.. బిస్కెట్ ప్యాకెట్లలోనూ ఫారిన్ నగదు...

|
Google Oneindia TeluguNews

స్మగ్లింగ్.. విదేశాల నుంచి అక్రమంగా నగదు, బంగారం తీసుకురావడం మాత్రం ఆగడం లేదు. స్మగ్లింగ్ చేసేందుకు కొత్తదారులు వెతుక్కుంటున్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయంలో బుధవారం విచిత్రంగా స్మగ్లింగ్ జరిగింది. మురాద్ అలామ్ అనే ప్రయాణికుడి నుంచి రూ.45 లక్షల విలువగల ఫారిన్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ నుంచి వస్తోన్న మురాద్ అలామ్.. పల్లీలు, బిస్కెట్ ప్యాకెట్లలో విదేశీ కరెన్సీ తీసుకొచ్చారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అతని వస్తువులు చెక్ చేయగా నగదు పట్టుబడింది. విదేశీ కరెన్సీ ఉన్న వీడియోను సెక్యూరిటీ సంస్థలు పోస్ట్ చేశారు. పల్లీల నుంచి విదేశీ కరెన్సీని వెలికితీశారు. అంతేకాదు బిస్కెట్ ప్యాకెట్ల నుంచి కూడా కరెన్సీ బయటపడింది. కరెన్సీ విలువ రూ.45 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.

Man held with Rs 45 lakh foreign currency at IGI in Delhi..

వీటిలోనే కాదు కూరలో కూడా కరెన్సీ కనిపించడం విశేషం. విదేశీ కరెన్సీని తీసుకొచ్చేందుకు అతను కొత్త దారిని అవలంభించారు. మురాద్ అలామ్‌ను కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇదివరకు కొందరు షూ లేస్, బెల్ట్.. ఇతర శరీర భాగాల్లో స్మగ్లింగ్ చేశారు. కానీ మురాద్ కొత్త పంథాలో తిను బండారాలు, కూరల్లో తీసుకొచ్చి కస్టమ్స్ అధికారులనే ఆశ్చర్యానికి గురిచేశారు.

English summary
Central Industrial Security Force at Delhi's Indira Gandhi International Airport apprehended a passenger trying to smuggle Rs 45 lakh worth of international currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X