వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం.. ఎక్కడో తెలుసా..!!

|
Google Oneindia TeluguNews

ఛాటర్‌పూర్ : కొందరు అతడిని టార్గెట్ చేశారు. డబ్బులు ఇవ్వమని వేధించాడు. ఇవ్వలేనని చెప్పినా వినిపించుకోలేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాలేదు అతడికి, పోలీసులకు చెప్పినా పట్టించుకోని పరిస్థితి. ఏం చేయాలో, సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. చివరికి జిల్లా పోలీసు బాస్ ఎస్పీ కార్యాలయం ముందు నిప్పంటించుకున్నాడు. అయితే అతను నిప్పంటించుకోవడంతో కలకలం రేగింది. ఏం జరిగిందని ఆరాతీస్తే అసలు విషయం వెలుగుచూసింది. కానీ బాధితుడు మాత్రం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

కేడీల ఆగమనం ..
మధ్యప్రదేశ్‌లోని ఛాటర్‌పూర్‌కి చెందిన కన్హయ్య జీవితం సాఫిగా సాగుతుంది. తన కుటుంబంతో సంతృప్తిగా ఉన్నారు. ఇంతలో కొందరు రౌడీలు అతని జీవితంలోకి ప్రవేశించారు. ఇంకేముంది నగదు ఇవ్వమని బెదిరించారు. తన వద్ద లేదు.. ఇచ్చుకోలేనని చెప్పినా చెవికెక్కించుకోలేదు. డబ్బులు ఇవ్వాల్సిందేనని మెడపై కత్తి పెట్టి బెదింరించినంత పనిచేశారు. దీంతో అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. స్థానిక పోలీసులకు చెబితే స్పందిస్తారో లేదోననే ఆందోళన అతని వెన్నాడింది. సమస్యకు తన చావే పరిష్కారమని భావించాడు. ఇంకేముంది సోమవారం ఛాటర్‌పూర్ ఎస్పీ కార్యాలయం ముందుకు చేరుకున్నాడు. అయితే అక్కడే ఉన్న గస్తీ సిబ్బంది అందరిలాగే వచ్చాడని అనుకున్నారు. కానీ అప్పటికే తనతో తీసుకొచ్చిన కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఆ మంటల ధాటికి హాహాకారాలు చేయడంతో సిబ్బంది, స్థానికులు అతడిని కాపాడేందుకు ప్రయత్నించారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

Man immolates himself outside SP office in Chhatarpur

సీరియస్ ..
ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు కన్హయ్య. అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు చెప్తున్నారు. అతన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు. కన్హయ్యను వేధించిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. బాధితుడి కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

English summary
A man immolated himself outside SP office in Chhatarpur district of Madhya Pradesh on Monday. The man has been identified as Kanhaiya Agrawal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X