• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

షాకింగ్ video: కొవిడ్ రోగి శవాన్ని నదిలో పడేసిన బంధువుల -చివర్లో ఊహించని ట్విస్ట్ -కేంద్రం సీరియస్

|

కరోనా మహమ్మారి అడుగడుగునా మానవత్వానికి, మనిషి తత్వానికి సవాళ్లు విసురుతున్నది. విలయకాలంలో ఆపదలో ఉన్నవారికి ఆదుకునేందుకు కొందరు ప్రయత్నిస్తోంటే.. వైరస్ సాకుతో ఇంకొందరు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు. ఉత్తరాదిలో పవిత్రమైన నదుల నిండా కొవిడ్ మృతదేహాలు కొట్టుకొస్తుండటం, గంగా తీరంలోని ఇసుకలో వందలాది శవాలు బయటపడుతుండటం కలకలం రేపుతోన్న సమయంలోనే మరో అనూహ్య సంఘటన వెలుగులోకి వచ్చింది..

తమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమునతమ్మీ అంటూ తడిబట్టతో గొంతు కోత -కేసీఆర్ ఆస్తుల గుట్టు -ముక్కు నేలకు -అంతా అమ్మేసి: ఈటల జమున

పీపీఈ కిట్‌లో వచ్చి..

పీపీఈ కిట్‌లో వచ్చి..

ఉత్తర ప్రదేశ్‌లో కోవిడ్‌ రోగి మృతదేహాన్ని బంధువులు నదిలో పారే రాప్తీ నదిలో పడేశారు. ఈ ఘటన మే 28న బల్రాంపూర్ జిల్లాలో చోటుచేసుకుంది. పీపీఈ కిట్ ధరించిన ఓ వ్యక్తి, అతని సహాయకుడు కలిసి బ్రిడ్జి మీదుగా ఓ మృతదేహాన్ని నదిలో పడేస్తుండగా, కారులో వెళుతోన్న మరో వ్యక్తి ఆ దృశ్యాలను తన ఫోన్ లో చిత్రీకరించారు. సదరు వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై కేంద్ర మంత్రి తీవ్రంగా స్పందించారు.

మృతదేహం తిరిగి అప్పగించి..

మృతదేహం తిరిగి అప్పగించి..

నదిలోకి శవాన్ని విసిరేసిన ఘటనపై లోతైన దర్యాప్తు జరగ్గా సమగ్ర వివారాలు బయటపడ్డాయి. కరోనా బాధిత వ్యక్తి ఈ నెల 25న బల్రాంపూర్‌ ఆస్పత్రిలో చేరి, చికిత్స పొందుతూ 28వ తేదీన కన్నుమూశాడు. అతని మృతదేహాన్ని కోవిడ్‌ నియమ నిబంధనల ప్రకారం బంధువులకు అప్పగించారు. అయితే రోగి మృతదేహాన్ని తీసుకెళ్లిన బంధువులు.. దాన్ని ఖననం చేయకుండా నదిలో విసిరేయడం, ఆ దృశ్యాలు గంటల్లోనే వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నదిలోకి విసిరేసిన మృతదేహాన్ని గాలించి, తిరిగి అప్పగించామని, వికృత చర్యకు పాల్పడిన బంధువులపై కేసులు కూడా నమోదయ్యాయని బల్రాంపూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ బిబి సింగ్‌ మీడియాకు తెలిపారు. కాగా,

అసదుద్దీన్ ఓవైసీ సంచలనం-లాక్‌డౌన్ వద్దు, వ్యాక్సిన్లు ఇవ్వండి-కేసీఆర్‌ను ఉద్దేశించి తొలిసారి తెలుగులో ట్వీట్లుఅసదుద్దీన్ ఓవైసీ సంచలనం-లాక్‌డౌన్ వద్దు, వ్యాక్సిన్లు ఇవ్వండి-కేసీఆర్‌ను ఉద్దేశించి తొలిసారి తెలుగులో ట్వీట్లు

నదుల్లో శవాలపై కేంద్రం సీరియస్..

నదుల్లో శవాలపై కేంద్రం సీరియస్..

యూపీలోని బల్రాంపూర్ జిల్లాలో కొవిడ్ రోగి మృతదేహన్ని నదిలోకి విసిరేసిన ఘటనపై కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్ర షెఖవత్ స్పందించారు. గంగ సహా ఇతర నదుల్లో మృతదేహాలను వేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని, ఇలాంటి చర్యల నిషేధానికి స్థానిక ప్రభుత్వాలు నడుంకట్టాలని, నదుల వెంట నిరంతరం తనిఖీలు చేస్తూ ఉండాలని, నదీ తీరాల్లో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి సూచించారు.

ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్‌ రాష్ట్రాల్లో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంతో ఆ మూడు రాష్ట్రాలు మరింత శ్రద్ధ వహించాలని కేంద్ర మంత్రి అన్నారు. కోవిడ్-19 నియమ నిబంధనల ప్రకారం మృతదేహాలకు అంత్యక్రియలు జరపాలని, ఈ ఘటనలపై 14 రోజుల్లో నివేదికకు ఆదేశించానని షెకావత్ చెప్పారు.

English summary
Aman wearing a PPE suit was seen throwing a body from a bridge into Rapti river in Uttar Pradesh’s Balrampur district. The entire incident was caught on camera.The video, which has been shared multiple times on social media, shows two men throwing a body into the river in Kotwali area of Balrampur. One of them is seen wearing a PPE suit.The police have identified the victim as Premnath, a resident of Shohratgadh Siddharathanagar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X