• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

స్మార్ట్‌ఫోన్ కోసం దారుణానికి ఒడిగడ్డిన యువకుడు .!! ఏం చేశాడో తెలుసా..!!!

|

అహ్మదాబాద్ : సమాజంలో మానవత్వం మంటగలుస్తోంది. మనిషిలో మంచితనం మసకబారిపోయింది. అన్నీ ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉంటున్నాయి. ఇక దొంగతనాలు చేసే వారు మాత్రం చిన్న, పెద్ద అనే తేడా చూపడం లేదు. తమకు కావాల్సిన నగదు లేదా వస్తువులు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. గుజరాత్‌లో కూడా ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. కానీ నిందితుడు మాత్రం నెలరోజుల తర్వాత పోలీసులకు పట్టుబడటం విశేషం.

1994లో 450.. ఇప్పుడేమో లక్షలు.. బాలాపూర్ లడ్డు ప్రస్థానం ఇలా

ఫోన్ కోసం ..

ఫోన్ కోసం ..

చిన్న, చితక దొంగతనాలు చేసే దొంగలు వారిలో మానవత్వం అసలే ఉండటం లేదు. తమకు కావాల్సిన వస్తువు దక్కడం లేదనే ఉద్దేశంతో చంపడానికి కూడా వెనకాడటం లేదు. అహ్మదాబాద్ జిల్లా డెట్రాజ్ తాలుకాలో నెలరోజుల క్రితం హృదయ విదారకర ఘటన జరిగింది. గత నెల 2న 11 ఏళ్ల బాలుడు పునాజీ అమ్రాట్జీ ఠాకూర్ రహదారిపై వెళ్తున్నాడు. అయితే అతని చేతిలో ఓ స్మార్ట్ ఫోన్ ఉంది. అయితే ఆ ఫోన్ విలువ రూ.4 వేలే కావడం గమనార్హం. కానీ ఫోన్‌పై ప్రవీణ్ బజానియా కన్నుపడింది. ఇంకేముంది దొంగతనం చేయాలని భావించాడు.

ఫాలో చేసి ..

ఫాలో చేసి ..

ఠాకూర్ రహదారిపై నడుచుకుంటూ వెళ్తుండగా ప్రవీణ్ వెంబడించారు. ఎవరూ లేని చోట దొంగతనం చేసేందుకు ప్రయత్నించాడు. అయితే బాలుడు అరవడంతో అక్కడినుంచి పారిపోయాడు. కానీ ప్రవీణ్ మాత్రం .. బాలునిపై పగ పెంచుకున్నాడు. తనకు మొబైల్ దక్కలేదని అక్కసు పెంచుకున్నాడు. ఇంకేముంది బాలుడిని మెల్లగా వెంబడించాడు. ఎవరూ లేరని నిర్ధారించుకొని అతని నుంచి ఫోన్ లాక్కున్నాడు. తర్వాత అతని గొంతుపై కత్తితో పొడిచి .. హతమార్చాడు. అక్కడే చిన్న గుంత తవ్వి బాలుడిని పూడ్చిపెట్టాడు. అక్కడినంచి పారిపోయాడు. కానీ నెలరోజల తర్వాత పోలీసులకు చిక్కాడు.

నెలరోజులు స్విచాఫ్

నెలరోజులు స్విచాఫ్

బాలుడిని ఫోన్ ఎత్తుకెళ్లిన ప్రవీణ్ .. తెలివిగా వ్యవహరించారు. ఫోన్ తీసుకెళ్లాడు కానీ దానిని ఆన్ చేయలేదు. గత మంగళవారం వరకు ఫోన్ స్విచాఫ్ చేసి ఉంది. అయితే మంగళవారం రోజున ఫోన్ చార్జీంగ్ చేశాడు. దీంతో పోలీసులు అతని లోకేషన్ కనుక్కొన్నారు. అతనిని అదుపులోకి తీసుకున్నారు. ఎందుకు బాలుడిని హతమార్చావని పోలీసులు అడిగితే .. ఫోన్ కోసమని చెప్పాడు. రూ.4 వేల ఫోన్ కోసం ఓ బాలుడిని పొట్టనపెట్టుకున్నాడు ప్రవీణ్. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలుడి పేరెంట్స్ కోరుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A21-year-old man was held on Tuesday for allegedly killing an 11-year-old boy for his smartphone, worth Rs 4,000. The incident took place on August 2 in Detroj taluka of Ahmedabad district in Gujarat. The accused, Pravin Bajania, a resident of Kaaz village near Rampura in Ahmedabad, was arrested by the local crime branch (LCB) of the Ahmedabad rural police on Tuesday. The incident happened when the boy, Punaji Amratji Thakor, was going home while playing on his smartphone. Pravin Bajania saw a smartphone in Punaji's hands and decided to snatch it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more