• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రోడ్డుపై చెత్త పడేయ్యద్దంటే కత్తితో దాడి .. ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

|

యవత్మల్ : మనం నడిచే రోడ్డుపై చెత్త పడేయ్యద్దంటే అతగాడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. తన వద్ద ఉన్న పదునైన ఆయుధంతో దాడి చేయడంతో ఒకరు మృతిచెందగా, మరొకరు మృత్యువుతో పోరాడుతున్నారు. మహారాష్ట్రలోని ఓ కుగ్రామంలో జరిగిన ఈ ఘటనతో ఊరిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా పోలీసులను మొహరించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

ప్రశ్నిస్తే దాడి ..

యవత్మల్ జిల్లా మహాగాన్ గ్రామానికి చెందిన ఓంకార్ అలియాస్ రిషాబ్ నార్వాడే ఉంటున్నారు. అతని స్నేహితుడు మనోజ్ భార్వాడే ఇతరులు తమ తమ పనిచేసుకుంటూ ఉన్నారు. అయితే గ్రామంలో స్వచ్చ భారత్ కానీ, పరిసరాలను పరిశుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. అయితే అదే వారి పాలిట శాఫమైంది. గ్రామానికి చెందిన గజానన్ రాథోడ్ కాస్త కటువైన వ్యక్తి. తన పని తాను చేసుకునే స్వభావం ఇతనిది. అయితే ఎవరైనా ఇతని గురించి వేలెత్తి మాట్లాడితే మాత్రం భౌతిక దాడి చేసేందుకు ఏ మాత్రం వెనుకాడడు.

Man kills neighbour who objects dumping of garbage, arrested

చెత్త పడేయడంతో ..

ఇటీవల గజానన్ పొలం పనులకు వెళ్తూ .. చెత్తను రోడ్డుపై పడేశాడు. అయితే ఇది చూసిన ఓంకార్, అతని స్నేహితుడు మనోజ్ అభ్యంతరం తెలిపారు. వెంటనే పరిశుభ్ర పరుచాలని కోరారు. ఈ అంశంపై వారి మధ్య మాటలయుద్ధం జరిగింది. అప్పటికే కోపంతో రగిలిపోతున్న గజానన్ .. తన వద్ద ఉన్న పదునైన కత్తి తీశాడు. అంతే ఓంకార్‌పై విచక్షణరహితంగా దాడి చేశాడు. తర్వాత అతని స్నేహితుడ మనోజ్‌పై కూడా విరుచుకుపడ్డాడు. అయితే తీవ్రగాయాలైన ఓంకార్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. మనోజ్ పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు ఓంకార్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి .. నిందితుడి కోసం గాలించారు. గంటల్లోనే గజానన్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a 22-year-old man was killed and his friend was critically injured on Tuesday when they were attacked by their neighbour during an argument over dumping of garbage in Mahagaon village in Maharashtra's Yavatmal district, police said. The accused, identified as Gajanan Rathod, has been arrested within hours of the incident, a police officer said. Explaining the sequence of events, he said the deceased, Omkar alias Rishabh Narwade and his friend Manoj Bharwade, took objection to Gajanan dumping garbage on the road. This had infuriated Gajanan, who then attacked Omkar and Bharwade with a sharp-edged weapon. While Narwade died during treatment at a private hospital, Bharwade is in critical condition, said Mahagaon police station inspector Damodar Rathod. The village remained tense following the incident, the officer said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more