వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉపాధ్యాయిని దారుణ హత్య: తరగతి గదిలో ఘాతుకం: తెగ నరికిన యువకుడు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఉపాధ్యాయురాలిపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. అందరూ చూస్తుండగా ఆమెను తెగ నరికాడు. శుక్రవారం ఉదయం జిల్లాలోని కురంజిపాడి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన సంభవించింది. మృతురాలి పేరు రమ్య. వయస్సు 23 సంవత్సరాలు.

కురింజిపాడిలోని గాయత్రి మెట్రిక్యులేషన్ స్కూల్ లో ఉపాధ్యాయినిగా పని చేస్తున్నారు. అయిదవ తరగతి విద్యార్థులకు ఆమె గణితాన్ని బోధిస్తారు. అదే గ్రామానికి చెందిన రాజశేఖర్ అనే యువకుడు ఆమెను కొద్దిరోజులుగా ప్రేమిస్తున్నాడు. తనను పెళ్లి చేసుకోవాలని వెంటపడుతున్నాడు. అతని ప్రేమను రమ్య నిరాకరించింది. అక్కడితో ఆగలేదు. నేరుగా రమ్య తల్లిదండ్రులను కూడా కలుసుకున్నాడు. రమ్యను పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకొచ్చాడు. వారు కూడా ఇందుకు ఒప్పుకోలేదు.

Man Kills Teacher In Classroom Allegedly For Rejecting Him

దీనితో కొంతకాలం నుంచీ అతను రమ్యపై కక్ష పెంచుకున్నాడు. అదను కోసం ఎదురు చూశాడు. శుక్రవారం ఉదయం ఎప్పట్లాగే రమ్య పాఠశాలకు వెళ్లింది. అప్పటికి ఇంకా విద్యార్థులు పెద్ద సంఖ్యలో రాలేదు. ఒంటరిగా తరగతి గదిలో కూర్చుని పుస్తకాలను తిరగేస్తుండగా.. రాజశేఖర్ అక్కడికి వెళ్లాడు. రమ్యతో ఘర్షణ పడ్డాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. ముఖం, మెడపై పొడిచి, పారిపోయాడు.

Man Kills Teacher In Classroom Allegedly For Rejecting Him

ఈ దాడిలో రమ్య సంఘటనాస్థలంలోనే ప్రాణాలు వదిలారు. ఈ ఘాతుకాన్ని కళ్లారా చూసిన స్వీపర్.. పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్ మార్టమ్ కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. రమ్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. రాజశేఖర్ కోసం గాలిస్తున్నారు. త్వరలోనే అతణ్ణి పట్టుకుంటామని కురింజిపాడి పోలీసులు తెలిపారు.

English summary
CHENNAI: A 23-year-old teacher was hacked to death by a man in a private school in Tamil Nadu's Cuddalore district, around 200 km from Chennai.S Ramya who taught Maths to students of Class 5 at Gayathri Matriculation School was alone in her classroom when the suspect Rajashekhar targeted her."She used to come early to the school as her home is nearby. We understand there was an argument after which he had killed her," said an official. Police suspect that refusal of marriage proposal could be the reason behind the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X