వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెక్స్ కు 'నో' చెప్పిందని భార్యను హత్య చేశాడు

|
Google Oneindia TeluguNews

ఆగ్రా : భార్య సెక్స్ కు నిరాకరించిందని ఏకంగా ఆమెనే హతమార్చాడు ఢిల్లీకి చెందిన బిర్జూ (40) అనే వ్యక్తి. హత్య తర్వాత పరిక్రమా మార్గ్ లోని ఓ నీళ్లు లేని బావిలో ఆమె మృత దేహాన్ని పడేసి తనకేం సంబంధం లేనట్టుగా వ్యవహరించడం మొదలుపెట్టాడు. మే 18న ఢిల్లీకి దగ్గరలోని ఆగ్రా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అయితే, మృతురాలు హీరాదేవి కనిపించకుండా పోవడంతో ఆమె సోదరి సమీప పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు మృతురాలి భర్తను అదుపులోకి తీసుకుని విచారించడం మొదలుపెట్టారు. విచారణలో భాగంగా నిజం ఒప్పేసుకున్న బిర్జూ తన భార్య సెక్స్ కు నిరాకరించినందువల్లే హత్య చేసి బావిలో పడేసినట్టుగా తెలిపాడు.

 Man kills wife for refusing sex

రెండు సంవత్సరాల క్రితం తన మొదటి భార్య చనిపోవడంతో హీరాదేవిని పెళ్ళిని చేసుకున్నానని చెప్పిన నిందితుడు బిర్జూ.. తనకు పిల్లలను కనాలని ఉండేదని, అయితే తన భార్య తనను శారీరకంగా కలిసేందుకు అంగీకరించలేదని దీంతో తీవ్ర అసహనానికి లోనై భార్యను హత్యనే చేసినట్టుగా అంగీకరించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

English summary
According to police the suspect, Birju, killed his wife, Heera Devi, on May 18 and dumped her body in a dry well near Parikrama marg. He confessed to his crime during questioning, following a missing person complaint lodged by the victim's sister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X