వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ వరుడు, ఇద్దరు వధువులు.. ఓకే కల్యాణ మండపంలో, ఫ్యామిలీ మెంబర్స్ సాక్షిగా పెళ్లి, ఏడడుగులు..

|
Google Oneindia TeluguNews

పెళ్లి అనేది వరుడు, వధువు మధ్య ఆడంబరంగా జరిగే వేడుక. కానీ ఒక కల్యాణ మండపంలో ఒక వరుడు, ఇద్దరు వధువులు పెళ్లి తంతు తెలుసా..? అసలు సనాతన హిందూ సంప్రాదాయం గల భారతదేశంలో ఇలాంటి ఘటన ఇదివరకు ఎప్పుడైనా జరిగిందా..? దాదాపుగా లేదు.. కానీ మధ్యప్రదేశ్‌లో ఇటీవల ఇలాంటి కల్యాణం జరిగింది. ఓ వరుడు, ఇద్దరు వధువులను హిందు సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ మహోత్సవాన్ని గ్రామస్తులు హాజరై తనివితీరా తిలకించారు.

Recommended Video

#WATCH Man Marries Both Lover and Bride Chosen by His Family Same Time Viral, Bizarre! || Oneindia
 ఇదీ విషయం..

ఇదీ విషయం..

మధ్యప్రదేశ్ గూడడొంగ్రీ బ్లాక్ కేరియా గ్రామానికి చెందిన సందీప్ యుకే చదువుకునే సమయంలో హోసంగబాద్‌కి చెందిన యువతితో పరిచయమైంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే సందీప్ పేరంట్స్ మాత్రం కోయలరీ గ్రామానికి చెందిన మరో యువతితో పెళ్లి నిశ్చయం చేశారు. ఈ సమయంలో సందీప్ ప్రేమ విషయం బయటపడింది. అతను ప్రేమించిన యువతి, సంబంధం మాట్లాడిన యువతికి చెందిన కుటుంబసభ్యులతో కలిసి పంచాయతీ పెట్టారు.

పెళ్లికి ఇద్దరు ఓకే..

పెళ్లికి ఇద్దరు ఓకే..

పంచాయతీ అంటే ఒకరినీ వివాహం చేసుకోవాలని పెద్దలు చెబుతారు. కానీ ఇక్కడ ఇద్దరూ సందీప్‌ను కోరుకున్నారు. అమ్మాయిల అభిప్రాయానికి కుటుంబసభ్యులు కూడా గౌరవం ఇచ్చారు. వారిద్దరూ కలిసి జీవించేందుకు సిద్ధమవడంతో ఇద్దరినీ ఇచ్చి వివాహం చేయాలని పంచాయతీ పెద్దలు తీర్పును ప్రకటించారు. దీంతో ఈ నెల 8వ తేదీన వివాహం జరిగింది. హిందూ సంప్రదాయం ప్రకారం ఇద్దరితో సందీప్ ఏడు అడుగులు నడిచారు. వివాహానికి వధువుల పేరంట్స్, బంధువులు, స్థానికులు హాజరయ్యారు.

 అభ్యంతరం లేకపోవడంతో..

అభ్యంతరం లేకపోవడంతో..

సందీప్‌తో పెళ్లికి కుటుంబసభ్యులు అంగీకరించడంతోనే పెళ్లి చేశామని పంచాయతీ పెద్దలు తెలిపారు. అభ్యంతరం తెలుపకపోవడంతో వివాహం జరిగిందన్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో పెళ్లి జరిగిన సంబంధిత అధికారులకు మాత్రం తెలియలేదు. కానీ గూడడొంగ్రీ తహశీల్దార్‌ మోనికా విశ్వకర్మకు మాత్రం తెలియదు అని పేర్కొన్నారు. తాము అనుమతి ఇవ్వలేదు అని.. విచారణ జరుపుతున్నామని తెలిపారు.

English summary
Sandeep Uike, a resident of Madhya Pradesh's Betul, solemnised the marriage with two women at a ceremony in Keria village under Ghodadongri block in madhya pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X