వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంట్రెస్టింగ్: ఈ వ్యక్తి ముందు రెండే ఆప్షన్లు.. పెళ్లా? జైలా? దేనికి ఓటు వేశాడో తెలుసా

|
Google Oneindia TeluguNews

అతను తప్పు చేశాడు... ఓ అమ్మాయిపై అత్యాచారం చేశాడు. సీన్ కట్ చేస్తే తాను చేసిన నేరానికి జైల్లో ఊచలు లెక్కబెడుతుండగా... అమ్మాయి గర్బం దాల్చింది. ఇక తనను ఎవరు పెళ్లి చేసుకుంటారని ప్రశ్నిస్తూ తన గర్భంకు కారణమైన వ్యక్తినే పెళ్లాడాలని డిసైడ్ అయ్యింది. అతన్ని పెళ్లాడాలంటే ఎలా..? కటకటాల వెనక ఖైదీ జీవితం గడుపుతున్న వ్యక్తిని ఎలా వివాహమాడాలి..? ఒకవేళ పెళ్లి చేసుకున్న ఆయనతో కాపురం ఎప్పుడు చేయాలి అనే ప్రశ్నలు ఆ యువతిని వెంటాడాయి... కానీ చివరకు ఏమి జరిగిందో తెలుసా....

గర్భవతిని చేశాడు

గర్భవతిని చేశాడు

షానవాజ్ గుల్... 27 ఏళ్ల వయస్సున్న ఈ వ్యక్తి జమ్‌షెడ్‌పూర్‌లో నివాసం ఉంటాడు. గుల్ బానో అనే యువతితో రెండేళ్లుగా సంబంధాన్ని నెరుపుతున్నాడు. ఒకానొక సమయంలో ఇద్దరు శారీరకంగా కలిశారు. ఆ తర్వాత కూడా సంబంధం కొనసాగించారు. ఒక రోజు ఉదయం గుల్‌బానో గర్భవతి అని తేలింది. వెంటనే ఈ విషయాన్ని షానవాజ్ గుల్‌కు చేరవేసింది. ఇంకేముంది విషయం తెలుసుకున్న షానవాజ్ కంగారు పడ్డాడు. ఓ వైపు గుల్‌బానో తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా బలవంతం చేస్తోంది. పెళ్లి చేసుకునేందుకు ససేమిరా అన్నాడు షానవాజ్.

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయతీ

పోలీస్‌ స్టేషన్‌కు చేరిన పంచాయతీ

గుల్ బానో గర్భవతి అనే విషయం బయటపడింది. ఇక చేసేదేమిలేక ఆమె తల్లిదండ్రులు షానవాజ్‌పై పోలీసు స్టేషన్లో అత్యాచారం కేసు నమోదు చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి షానవాజ్‌ను అరెస్టు చేశారు. అయితే పోలీసులు గుల్‌బానోను పెళ్లి చేసుకోవాల్సిందిగా చెప్పారు. కానీ ఆయన ఇందుకు నిరాకరించాడు. అయితే పోలీసులు ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. పెళ్లి చేసుకోకపోతే షానవాజ్ జైలు జీవితం గడపాలని... అయితే ఇద్దరూ ఇష్టపడే వ్యవహారాన్ని నడిపారన్నది ఇటు గుల్‌బానో తల్లిదండ్రులకు కూడా వివరించారు. దీని వల్ల ఎదుర్కోవలసిన కష్టాలను కూడా పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలకు వివరించారు. దీంతో వేరే ఆలోచనకు తావివ్వకుండా రెండు కుటుంబ పెద్దలు పెళ్లికి అంగీకరించారు. పోలీస్ స్టేషన్‌లోనే ఇద్దరి పెళ్లి జరిపించారు పోలీసులు.

పెళ్లా... జైలా..? రెండే ఆప్షన్లు

పెళ్లా... జైలా..? రెండే ఆప్షన్లు

అంతకుముందు గుల్‌బానో తల్లిదండ్రులు షానవాజ్ తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి వివాహం జరిపించాల్సిందిగా కోరారు. కానీ ఇందుకు షానవాజ్ తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి వారి సమక్షంలోనే పెళ్లి జరిగేలా చూశారు. జైలు కావాలా పెళ్లి చేసుకుంటావా అనే రెండు ఆప్షన్లు షానవాజ్‌కు ఇవ్వడంతో పెళ్లి వైపే మొగ్గు చూపాడు. పెళ్లి తర్వాత అమ్మాయిని చిత్రహింసలు లాంటివి పెట్టడం జరిగితే తక్షణమే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించి పంపించివేశారు.

English summary
When Shahnawaz Gul had to choose between going to jail for rape or marrying his long time fiancée Gul Bano, the 27-year-old man chose the latter. The wedding ceremony took place at Kowali police station under Potka block of East Singhbhum on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X