మండపంలోనే వరుడికి షాకిచ్చిన వధువు, ట్విస్టిచ్చిన వరుడు, ఏం జరిగిందంటే?
పాట్నా: బట్టతల ఉందని మరికొన్ని క్షణాల్లో వివాహం జరగాల్సి ఉండగా వివాహం చేసుకోవడానికి ఓ వధువు నిరాకరించింది. దీంతో అదే సమయానికి మరో యువతితో ఆ యువకుడు వివాహం చేసుకొన్న ఘటన బీహర్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. అయితే కొత్త పెళ్ళి కూతురితో ఇంటికి వచ్చిన వరుడిని చూసిన వారు షాకయ్యారు.
న్యూఢిల్లీకి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ రవికుమార్‌కు బీహర్‌లోని చంపారన్‌లోని సుగాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే చివరి నిమిషంలో యువతి డాక్టర్ రవికుమార్ ను వివాహం చేసుకొనేందుకు ఒప్పుకోలేదు.
పెళ్ళి మండపంలోనే యువకుడితో వివాహనికి ఆ యువతి అంగీకరించలేదు. దీంతో వివాహన్ని అప్పటికప్పుడు రద్దు చేసుకొన్నారు. కానీ, అదే సమయానికి మరో యువతితో డాక్టర్ రవికుమార్ వివాహం జరిగింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.
పెళ్ళి మండపంలోనే పెళ్ళికి నిరాకరించిన వధువు
న్యూఢిల్లీకి చెందిన డాక్టర్ రవికుమార్‌కు బీహర్‌లోని సుగాలి గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే పెళ్ళి మండపానికి వరుడు వచ్చాడు. అప్పటికే యువతి పెళ్ళి మండపంలోనే ఉంది .పెళ్ళి కొడుకు టోపీ తీసి పెళ్ళి మండపంలోకి వచ్చేశాడు. అయితే అతడికి జుట్టు లేదు. బట్టతల, ఈ విషయాన్ని వధువు గుర్తించింది. దీంతో పెళ్ళికి ఒప్పుకోలేదు.
బట్టతలతో పెళ్ళి మండపంలోనే తెగేసి చెప్పిన వధువు
పెళ్ళి మండపంలోనే వరుడు రవికుమార్‌కు బట్ట తల ఉన్న విషయాన్ని గుర్తించిన వధువు తాను పెళ్ళి చేసుకోనని తెగేసి చెప్పింది. వధువు తల్లిదండ్రులు కూడ కూతురు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నారు. దీంతో ఆ వివాహం రద్దైంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్ధం కాలేదు.ఎవరెన్ని చెప్పినా వధువు మాత్రం ఒప్పుకోలేదు.
మరో అమ్మాయితో అదే ముహుర్తానికి వివాహం
వధువు వివాహనికి ఒప్పుకోకపోవడంతో ఆ వివాహం రద్దైంది. అయితే గ్రామ పెద్దలు అదే గ్రామానికి చెందిన మరో యువతితో డాక్టర్ రవికుమార్‌కు అదే ముహుర్తానికి వివాహం చేశారు. అన్ని అనుకొన్నట్టుగా జరిగినా, చివరి నిమిషంలో వధువు మారిపోయిందని డాక్టర్ రవికుమార్ కుటుంబసభ్యులు అభిప్రాయపడుతున్నారు.
నిశ్చితార్థం ఒకరితో పెళ్ళి మరోకరితో
వివాహనికి హజరుకాని డాక్టర్ రవికుమార్ బంధువులు కొత్త దంపతులను చూసి ఆశ్చర్యపోయారు. నిశ్చితార్ధం రోజున వధువు స్థానంలో ఉన్న అమ్మాయి స్థానంలో మరో అమ్మాయి ఉండడాన్ని గుర్తించిన బంధువులు షాకయ్యారు. ఈ విషయమై రవికుమార్ కుటుంబసభ్యులను ఆరా తీస్తే అసలు విషయం వెలుగు చూసింది.