నడివీధిలో అసభ్య భంగిమలో: యువజంట రొమాన్స్.. ఇదేంటన్నందుకు పొడిచేశారు..

Subscribe to Oneindia Telugu

ముంబై: పట్టపగలు.. అదీ నడివీధిలో.. నలుగురు తిరుతున్నారన్న విషయం కూడా మరిచిపోయి.. ఏదో బెడ్ రూమ్ లో ఉన్నామన్నట్లుగా వ్యవహరించింది ఓ జంట. అసభ్య భంగిమలో వారు చేస్తున్న చేష్టలు, ముద్దులూ చూడలేక.. ఓ పెద్దాయన వారిని మందలించాడు.

మాట వినడం సంగతి అటుంచితే.. మంచి చెప్పిన పెద్దాయన్నే పొడిచేశారు. ముంబైలోని పరేల్ ప్రాంతంలో ఉన్న ఓ వీధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గణేశ్ సహానేఅనే ఓ వ్యక్తి రోడ్డుపై నడుస్తున్న వేళ.. మాంటీ అనే యువకుడు మరో యువతితో కలిసి రొమాన్స్ చేయడం కనిపించింది. నడివీధిలో వారు చేస్తున్న పనులను చూసి సహించలేక.. దగ్గరికెళ్లి సున్నితంగా మందలించాడు.

Man objects to couple kissing in public, gets stabbed

దీంతో సహానేకి మాంటీకి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. తీవ్ర ఆగ్రహావేశంతో ఊగిపోయిన మాంటీ తన స్నేహితులను పిలిపించి.. సహానేపై దాడికి దిగాడు. రోడ్డు పక్కన పడి ఉన్న ఓ గాజు సీసాతో సహానేను పొడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు..తీవ్ర గాయాలపాలైన సహానేను ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడినవారిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా.. మిగతావారు పరారీలో ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 27-year-old man was stabbed with a broken glass and injured after he objected to a couple kissing in public in Parel in central Mumbai on Monday, police said
Please Wait while comments are loading...