సెక్స్‌కు ఇష్టపడని భార్యపై యాసిడ్ పోసిన భర్త
చెన్నై: లైంగిక క్రీడకు నిరాకరించిందనే కోపంతో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి తన 38 ఏళ్ల భార్యపై క్లీనింగ్ యాసిడ్ పోశాడు. దీంతో ఆమె గాయపడి ఆస్పత్రి పాలైంది. బుధవారం ఉదయం వారి ఇంటిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. తనతో లైంగిక క్రీడకు నిరాకరించిందనే కోపంతో అతను ఆ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
వివరాలు ఇలా ఉన్నాయి - టైలర్‌గా పనిచేస్తున్న కుప్పారావు (40) తన భార్య జయలక్ష్మితో ఐసిఎఫ్‌లోని రైల్వే కాలనీలో నివసిస్తున్నాడు. వారికి ఐదుగురు పిల్లలు. మంగళవారం రాత్రి కుప్పారావు తాగి ఇంటికి వచ్చాడు. లైంగిక క్రీడకు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు భార్య నిరాకరించడమే కాకుండా తాగి వచ్చినందుకు తిట్టింది కూడా.

తీవ్రమైన గొడవ తర్వాత కుప్పారావును బయటకు తరిమేసి, ఇంట్లోకి వచ్చి తలుపులకు తాళం వేయకుండా పడుకుంది. రాత్రి కుప్పారావు ఇంటికి తిరిగి వచ్చాడు మరోసారి బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్స్ కోసం భార్యను అర్థించాడు. అతన్ని భార్య పక్కకు నెట్టేయడమే కాకుండా తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించింది.
కుప్పారావు బాత్రూంకు వెళ్లి, శుభ్రం చేయడానికి అక్కడ ఉంచిన యాసిడ్ తెచ్చాడు. అయితే, ఇది నిద్రపోయిన జయలక్ష్మి గమనించలేదు. ఆమెపై కుప్పారావు యాసిడ్ చల్లాడు. దాంతో మంట పుట్టి అరవడం ప్రారంభించింది. ఇరుగుపొరుగువారు వచ్చి ఆమెను కిల్పౌక్ వైద్య కళాశాల, ఆస్పత్రికి తరలించారు. చికిత్స తర్వాత ఆమెను డిశ్చార్జీ చేశారు. స్వల్పంగా మాత్రమే ఆమె గాయపడినట్లు పోలీసులు తెలిపారు. అయితే, ఆమె భర్తపై ఫిర్యాదు చేయడానికి నిరాకరించింది. అతనితో రాజీకి వచ్చింది.












Click it and Unblock the Notifications