• search
  • Live TV
బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

శోభనం గదిలో ఫోన్ మోత.. భార్య పోర్న్ వీడియోలు చూసి షాక్.. పోలీసులు ఏం చేశారంటే..

|

అమ్మాయి అందంగా ఉందని అబ్బాయివాళ్లు కట్నం కూడా పెద్దగా డిమాండ్ చేయలేదు.. పెద్దలు కుదిర్చింది కావడంతో పెళ్లి ఘనంగా జరిగింది.. హడావిడి తగ్గిన తర్వాత అసలు కార్యం కోసం ముహుర్తం ఖరారు చేశారు. శోభనం రాత్రి అదో రకం ఉత్సాహంతో గదిలోకి ఎంలరయ్యారా జంట.. అంతలోనే భర్త ఫోన్ కు వరుసగా వీడియో మెసేజ్ లు వచ్చాయి.. ఓపెన్ చేస్తే.. అవన్నీ తన భార్య సెక్స్ వీడియోలు..

కంగుతిన్న పెళ్లికొడుకు.. వెంటనే భార్యను నిలదీశాడు. ఆమె తనకేమీ తెలీదని చెప్పింది. అమ్మాయి తల్లిదండ్రులు కూడా అదే మాట బలంగా చెప్పడంతో.. వాళ్ల తరఫున పోరాడేందుకు సిద్ధపడ్డాడా పెళ్లికొడుకు. కానీ ఈలోపే ఆ వీడియోలు పంపిన వ్యక్తి.. తన ఫోన్ నంబర్ ను కూడా పంపాడు. జరిగిన తతంగమంతా పూసగుచ్చినట్లు వివరించాడు. దీంతో మరో షాక్ తిన్న పెళ్లికొడుకు ఈసారి అమ్మాయిపైన, వాళ్ల అమ్మానాన్నలపైన చీటింగ్ కేసు పెట్టాడు.

Man Receives Wifes Porn Video before first night, He Files Complaint, She Threatens Suicide

బెంగళూరులో సంచలనం రేపిన ఈ కేసుకు సంబంధించి పోలీసులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.. సిటీకి చెందిన ఓ యువకుడు.. భార్య, అత్తమామలపై మోసం కేసు పెట్టాడు. తన భార్య.. పెళ్లికి ముందు ఏడు నెలలపాటు వేరొక యువకుడితో కలిసి ఉందని, నిశ్చితార్థం తర్వాత కూడా అతనితో పక్క పంచుకుందని, పెళ్లికి రెండ్రోజుల ముందు కూడా చాటింగ్ చేసిందని పెళ్లికొడుకు ఆరోపించాడు.

తొలుత అమ్మాయితో ఏడు నెలలుగా సంబంధం కొనసాగిస్తున్న యువకుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనతో పెళ్లికి నిరాకరించినప్పటికీ, సంబంధం మాత్రం యధావిధిగా కొనసాగిద్దామని యువతి చెప్పిందని, అయితే తనకు మాత్రం పెళ్లి చేసుకోవాలనే ఆశ ఉందని, అందుకే తాము దగ్గరగా ఉన్నప్పటి ఫొటోలు, వీడియోలను భర్తకు పంపానని అతను వివరణ ఇచ్చుకున్నాడు.

విషయం మొత్తం బయటపడటంతో ఆ అమ్మాయి ప్లేటు ఫిరాయించింది. ఇద్దరూ కలిసి కావాలనే తన జీవితాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, భర్త కాదంటే తాను ఆత్మ హత్య చేసుకుంటానని పోలీస్ స్టేషన్ లోనే ఆందోళనలకు దిగింది. మొత్తంగా పలు దఫాలుగా కౌన్సిలింగ్ ఇస్తూ కేసును ఓ కొలిక్కి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

English summary
The Bengaluru resident has now asked police for a thorough probe against his wife for having a relationship with another man. Police have filed a case of breach of trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more