బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం : హగ్ చేసుకోనివ్వలేదని హత్యాయత్నం చేశాడు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు : ఇద్దరు స్నేహితుల మధ్య చిన్న వివాదం కత్తిపోట్లకు దారి తీసింది. నోటి నుంచి దుర్వాసన వస్తోందని హగ్ చేసుకునేందుకు నిరాకరించిన యువకున్ని మరో వ్యక్తి దారుణంగా పొడిచాడు. బెంగళూరులోని ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బెంగళూరు కలాసిపాలెం మావళ్లికి చెందిన చెందిన సోహెబ్ పాషా, నబీ స్నేహితులు. ఆదివారం రాత్రి 11.45గంటల సమయంలో వారిద్దరు కలుసుకున్నారు. సోహెబ్‌ను చూసిన నబీ అతన్ని హగ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అయితే నబీ నోటి నుంచి దుర్వాసన వస్తోందని హేళన చేస్తూ సోహెబ్ నబీని వెనక్కి తోసేశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన నబీ తన వద్దనున్న కత్తితో సోహెబ్‌పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా పొడిచాడు.

man refuses to hug friend because of bad breath. friend stabs him

తీవ్రగాయాలపాలైన సోహెబ్ విషయాన్ని సోదరుడు షాహిద్‌కు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే అక్కడకు చేరుకున్న అతనిపై కూడా నబీ దాడికి దిగాడు. షాహిద్‌ను కత్తితో పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తపు మడుగులు కొట్టుకుంటున్న అన్నదమ్ములు సోహెబ్, షాహిద్‌లను అటుగా వెళ్తున్నవారు చూసి హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం ఇద్దరికీ ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పారు. సోహెబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 307కింద పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. నిందితుడు నబీని అరెస్ట్ చేశారు.

English summary
A tiff over refusing to hug a friend led to two being stabbed in Bengaluru. Two friends, Shoaib Pasha and Nabi chanced upon each other on LBF Road in the Mavalli area. When Nabi tried to hug Shoaib, he was pushed away. Shoaib made a comment about Nabi's bad breath, which incensed the latter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X