• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాయ్‌ఫ్రెండ్, వివాహిత మధ్యలో ఇంకొకడు : వాళ్లిద్దరూ చచ్చారు

|

మీరట్ : అతను చేసిన తప్పిదం ఇద్దరి ప్రాణాలు తీయడానికి కారణమైంది. ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న యువకుడు .. తనతో చనువుగా ఉన్న ఫొటోలు తీసుకున్నాడు. అయితే ఫోన్ అమ్మే సమయంలో మాత్రం వాటిని డిలేట్ చేయలేదు. దీనినే అదనుగా తీసుకొన్న కొన్న వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టడం, మనస్థాపంతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన యూపీలోని మీరట్‌లో సంచలనం సృష్టించింది.

కారణమిది

కారణమిది

మీరట్‌కు చెందిన శుభమ్ కుమార్, ముజఫర్‌నగర్‌కు చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లికి కాక ముందు వారు లవర్స్. తర్వాత ఆమెకు పెళ్లైంది, ఐదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. గతంలో వీరిద్దరూ చనువుగా ఉన్న సమయంలో ఫోటోలు కూడా తీసుకున్నారు. వాటిని తన ఫోన్‌లో ఉంచుకున్న శుభమ్ .. ఫోన్ అమ్మే సమయంలో మాత్రం తన గ్యాలరీ నుంచి డిలేట్ చేయడం మరచిపోయాడు. కొద్దిరోజుల క్రితం మీరట్‌కు చెందిన ప్రజాపతికి తన ఫోన్‌ను విక్రయించాడు శుభమ్. ఫోన్ తీసుకున్న ప్రజాపతి .. అందులో వీరిద్దరూ చనువుగా ఉన్న ఫోటోలు చూశాడు. అయితే వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు తెగ వైరలయ్యాయి.

ఫోటోలు వైరల్ .. ఆత్మహత్య

ఫోటోలు వైరల్ .. ఆత్మహత్య

ఇంటర్నెట్‌లో తన ఫోటోలు వైరలవుతున్న విషయాన్ని తెలిసి వివాహిత తట్టుకోలేకపోయింది. శనివారం తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ముజఫర్‌నగర్ గగ్‌నాహర్ కెనాల్ నుంచి దూకింది. దీంతో ఆమె మృతిచెందింది. అదృష్టవశాత్తు ఆమె కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆత్మహత్యకు ముందు భర్తతో కూడా మాట్లాడింది. శుభమ్ కు ఫోన్ చేసి వాదనుకు దిగి ఆత్మహత్య చేసుకుంది.

అంతకుముందే ప్రజాపతి హత్య

అంతకుముందే ప్రజాపతి హత్య

ఈ కేసులో మరో ట్విస్ట్ ఏంటంటే .. సోషల్ మీడియాలో ఫోటోలు వైరలైన వెంటనే శుభమ్ కుమార్ స్పందించారు. తాను ఫోన్ విక్రయించిన అనూజ ప్రజాపతిని కలిసి ఎందుకు అప్‌లోడ్ చేశావని అడిగాడు. టింకర సమాధానం ఇవ్వడంతో తన స్నేహితులతో కలిసి ప్రజాపతిని మట్టుబెట్టాడు. ప్రజాపతిని హతమార్చిన కేసు విషయంలో నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీ టీవీ ఫుటేజీని కూడా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేస్తున్నారు. శనివారం అటుగా వచ్చిన శుభమ్ వాహనం .. తనిఖీలకు సహకరించకపోగా .. ఎదురుకాల్పులు జరిపింది. తర్వాత పోలీసులు కాల్పులు జరిపారు. నిందితుడు శుభమ్ సహా స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు.

ముగ్గురు చచ్చారు

ముగ్గురు చచ్చారు

శుభమ్ తన ఫోన్ లోని ఫోటోలు డిలేట్ చేయకపోవడం ఇద్దరి ప్రాణాలు బలితీసుకుంది. ఆయన ఫోటోలు డిలేట్ చేస్తే .. ప్రజాపతి షేర్ చేసేవాడు కాదు .. వివాహిత ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చేది కాదు. కానీ వివాహిత కుమారుడు మాత్రం తల్లిని కోల్పోవడం విషాదకరం.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
a murder, a suicide and an encounter. All after a Meerut-based man forgot to delete a few inappropriate photos with his ex-girlfriend from a mobile phone before he sold it. The horrific turn of events started when on Saturday, a 35-year-old woman jumped off a bridge with her five-year-old son in Muzaffarnagar's Gangnahar canal, Times of India reported. While the woman, who was settled in Meerut, died, her child was rescued. During the investigation, police learnt that photos of the woman with her former boyfriend had gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more