వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిక్ టాక్ సైడ్ ఎఫెక్ట్స్: వీడియో కోసం నడిరోడ్డులో జీపును తగులబెట్టిన ప్రబుద్ధుడు

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: ఏదైనా ఓ ట్రెండ్ లోకి వస్తే.. దాన్ని అనుసరిస్తుంటారు కొందరు ప్రబుద్ధులు. ఇదివరకు సెల్ఫీల పిచ్చితో ప్రాణాల మీదికి తెచ్చుకునే వారు. ఇక దాని స్థానంలో టిక్ టాక్ మేనియా అలుముకొంది. టిక్ టాక్ వీడియోల కోసం సొంత ఆస్తులను సైతం ధ్వసం చేసుకోవడానికి వెనుకాడట్లేదనే వ్యవహారం తాజాగా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ యాప్ మోజులో పడి కొందరు ప్రాణాలు పోగొట్టుకుంటుంటే...మరికొందరు సొంత ఆస్తుల్ని సైతం మంటలపాలు చేస్తున్నారనడానికి ఈ ఉదంతం నిలువెత్తు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

టార్గెట్..2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పగ్గాలు ప్రియాంకా గాంధీ చేతికి? టార్గెట్..2022: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ ఛార్జి పగ్గాలు ప్రియాంకా గాంధీ చేతికి?

గుజరాత్ లోని రాజ్‌ కోట్‌ కు చెందిన ఇంద్రజిత్ జడేజా అనే వ్యక్తి.. కొఠారియా మార్గంలో నడిరోడ్డులో తన జీపుపై పెట్రోలు పోసి, మండుతున్న అగ్గిపుల్ల విసిరేశాడు. క్షణాల్లో భగ్గుమని అంటుకుందా వాహనం. మంటల్లో మాడి మసి అయింది. ఇంద్రజిత్ జడేజా స్నేహితుడు నైమిష్ గోహిల్ అనే వ్యక్తి ఈ తతంగాన్నంతటినీ తన సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. అనంతరం దీనిపై టిక్ టాక్ లో ఓ వీడియోను చిత్రీకరించారు. నడిరోడ్డులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో కొఠారియా మార్గంలో రాకపోకలు సాగిస్తోన్న వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు. తమ వాహనంతో సహా పరుగులు పెట్టారు. ఈ ఉదంతానికి సంబంధించిన 21 సెకెన్ల నిడివి ఉన్న వీడియో సోషల్ మీడియాకు కుదిపి అవతల పడేస్తోంది.

 man sets car on fire, friend records him, Cops arrest both after

ఇంద్రజిత్ .. ఆర్థికంగా బలంగా ఉన్నవాడని స్థానికులు చెబుతున్నారు. అతని పెద్ద ఎత్తున వజ్రాల వ్యాపారాలు ఉన్నాయని అంటున్నారు. ఆర్థికంగా స్థితిమంతుడు కావడం వల్లే ఓ చిన్న వీడియో కోసం జీపును మంటలపాలు చేశారని స్థానికులు ఎద్దేవా చేస్తున్నారు. జీపునకు మంటలు అంటించే సమయంలో అతని మెడలో లావుపాటి బంగారు గొలుసులు, చేతులకు ఉంగరాలు, బ్రేస్ లెట్ ఉండటాన్ని స్థానికులు ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న కొద్దిసేపటికే వారిద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. జీపు సకాలంలో స్టార్ట్ కాకపోవడం వల్ల ఆగ్రహానికి గురై, దాన్ని తగులబెట్టినట్లు మొదట చెప్పుకొచ్చాడట జడేజా. అనంతరం పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించే సరికి అసలు విషయాన్ని వెల్లడించాడు. అనంతరం బెయిల్ పై వారిద్దరినీ విడుదల చేశారు.

English summary
The instance took place in Rajkot where the man, Indrajeet Singh Jadeja, doused petrol on his car and then set it on fire because the car’s battery was not working. Indrajeet got so angry because the car's cell was not working that he then doused petrol on the car. In fact, while he was doing all this, his friend Naimish Gohil recorded the whole scene on video and even made it viral on the video-sharing app TikTok.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X