వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ సీఎం ఇంట్లోకి చొరబడేందుకు వ్యక్తి యత్నం: కాల్చి చంపేశారు

|
Google Oneindia TeluguNews

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలో చొరబడేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది కాల్చివేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూలోని భటింది ప్రాంతంలో గల ఫరూఖ్ అబ్దుల్లా నివాసంలోకి శనివారం ఉదయం ఓ వ్యక్తి చొరబడ్డాడు.

కారులో వేగంగా వచ్చి ఫరూఖ్‌ నివాసం ప్రధాన ద్వారాన్ని ఢీకొట్టాడు. అనంతరం కారులో నుంచి దిగి ఇంట్లోకి దూసుకెళ్లాడు. భద్రతాసిబ్బంది అడ్డుకున్నా.. ఆ వ్యక్తి ఆగకపోవడంతో అతడిపై కాల్పులు జరిపారు. దీంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

Man shot dead for forcefully trying to enter Farooq Abdullahs Jammu residence

ఆగంతకుడిని పూంఛ్‌ జిల్లాకు చెందిన ముర్తాజ్‌గా పోలీసులు గుర్తించారు. ముర్తాజ్‌ కుటుంబం ప్రస్తుతం జమ్మూలో నివాసముంటోంది. అతడి తండ్రి బన్‌-తలబ్‌ ప్రాంతంలో తుపాకుల ఫ్యాక్టరీ నడుపుతాడని పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం ఫరూఖ్ అబ్దుల్లా శ్రీనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్నారు. ఘటన జరిగిన సమయంలో ఆయన ఇంట్లో లేరు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటనపై ఫరూఖ్ తనయుడు, మాజీ సీఎం ఒమర్‌ అబ్దుల్లా ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'నాన్న ఇంటి వద్ద జరిగిన విషయం గురించి తెలిసింది. చొరబాటుదారుడు ఇంట్లోని పైఅంతస్తులోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు అతడి గురించి వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు' అని ఒమర్‌ అబ్దుల్లా వెల్లడించారు.

English summary
A man was gunned down by security personnel when he was trying to enter former Jammu and Kashmir Chief Minister Farooq Abdullah's residence in Jammu in a car on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X