వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలీవుడ్ హాట్ గర్ల్ చెంప చెళ్ళుమనిపించిన యువకుడు

By Srinivas
|
Google Oneindia TeluguNews

man slaps Bollywood actress, held
ముంబై: ఓ యువకుడు బాలీవుడ్ నటి చెంప చెళ్లుమనిపించాడు. బాలీవుడ్ హాట్ గర్ల్ గౌహర్ ఖాన్ పైన చేయి చేసుకున్నాడు. నా పేరే కాంచనమాల.. నా వయసే గరం మసాలా.. అంటూ శంకర్‌దాదా ఎంబీబీఎస్‌ సినిమాలో ఆడిపాడిన హాట్‌ గర్ల్‌ గౌహర్‌ఖాన్.

పొట్టి దుస్తులతో కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేకెత్తించే ఆమెకు ఒక చేదు అనుభవం ఎదురొంది. ఒక ముస్లింవై ఉండీ ఇలాంటి దుస్తులు వేసుకుంటావా అంటూ నటి, మోడల్‌ గౌహర్ ఖాన్‌ చెంప ఛెళ్లుమనిపించాడు ఓ యువకుడు. అక్కడితో ఆగకుండా.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

అతడి పేరు మాలిక్‌ అకిల్‌. వయస్సు 24 ఏళ్లు. గోరేగావ్‌ శివార్లలోని ఫిలిం సిటీలో ఇండియాస్‌ రా స్టార్‌ అనే రియాలిటీ షోని ఆమె నిర్వహిస్తున్నారు. ఆయన మూడు రోజులుగా ఈ షోకు హాజరవుతున్నాడు. ఆదివారం నాడు ప్రేక్షకుల్లోని అకిల్‌ ఈ దాడికి పాల్పడ్డాడు.

అయితే, అక్కడున్న సెక్యూరిటీ గార్డులు వెంటనే అప్రమత్తమై అతడిని బయటకు ఈడ్చిపారేశారు. పోలీసులు అకిల్‌పై కేసు నమోదు చేశారు. మంగళవారం అతణ్ని కోర్టులో హాజరుపరుస్తారు. మాలిక్‌ మాత్రం ముస్లిం మహిళ అయిన ఆమె అంత పొట్టి దుస్తులు ధరించకూడదని తన చర్యను సమర్థించుకుంటున్నాడు.

English summary
A 24 year old man, one of the audiences of reality TV show Raw Star in Film City allegedly slapped and inappropriately touched host Gauhar Khan before berating her for being “unbecoming” of a Muslim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X