వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదులుతున్న రైలులో నుంచి పడిన యువకుడు.. బతికి బయటపడ్డాడిలా (వీడియో)

|
Google Oneindia TeluguNews

Recommended Video

రైలు-ప్లాట్‌ఫాం మధ్యలో పడిన యువకుడు: ఆర్పీఎఫ్ సిబ్బంది కాపాడారిలా(వీడియో)

అహ్మదాబాద్: కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ప్రాణాలకే ప్రమాదం. తాజాగా, ఓ యువకుడు కదులుతున్న రైలు ఎక్కే ప్రయత్నంలో రైలుకు, ప్లాట్ ఫాంకు మధ్య పడిపోయాడు. వెంటనే ఆర్పీఎఫ్ సిబ్బంది స్పందించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే!హైప్రొఫైల్ సెక్స్ స్కాండల్: మాజీ సీఎం, గవర్నర్‌తోపాటు నేతలు, అధికారులూ విటులే!

రైలు కదులుతుండగా..

రైలు కదులుతుండగా..

ఈ ఘటన అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. కదులుతున్న ఆశ్రమ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కేందుకు ఓ యువకుడు ప్రయత్నించాడు. రైలు ఎక్కే క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన అతడు కిందపడిపోయాడు.

రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్యలో..

రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్యలో..

రైలుకి, ప్లాట్ ఫాంకి మధ్యలో పడి కొంత దూరం వరకు అలాగే వెళ్లాడు. అయితే, అక్కడేవున్న రైల్వే రక్షణ బలగాలు వెంటనే అప్రమత్తయ్యారు. ఇద్దరు ఆర్పీఎఫ్ సిబ్బంది ఆ యువకుడ్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రైల్లోకి తోసేశారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు.

మీరు ఫిట్‌గా ఉన్నా..

మీరు ఫిట్‌గా ఉన్నా..

మీరు ఫిట్‌గా, స్మార్ట్‌గా ఉన్నప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేటప్పుడు అజాగ్రత్త వహించొద్దు అని రైల్వే శాఖ తన ట్వీట్‌లో హితవు పలికింది. రైల్వే శాఖ ట్వీట్ చేసిన వీడియోకు ఇప్పటికే 12వేలకు పైగా లైక్స్ వచ్చాయి. 1.4లక్షలకుపైగా వీక్షణలు వచ్చాయి.

కుడోస్ ఆర్పీఎఫ్..

ఇక రైల్వే శాఖ చేసిన ట్వీట్‌కు నెటిజన్లు తమదైన శైలిలో స్పందనలు వ్యక్తం చేశారు. ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రశంసిస్తూ రీట్వీట్లు, కామెంట్లు చేశారు. అప్రమత్తంగా వ్యవహరించి ఓ యువకుడి ప్రాణాలు కాపాడారంటూ కొనియాడారు. కుడోస్ ఆర్పీఎఫ్ అంటూ ప్రశంసించారు.

రైలు మళ్లీ వస్తుంది.. ప్రాణం?

రైలు మళ్లీ వస్తుంది.. ప్రాణం?

ప్రయాణికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టే ఇలాంటి సాహసాలు చేయొద్దంటూ పలువురు నెటిజన్లు సూచించారు. ఆర్పీఎఫ్ ఎప్పుడూ నిరాశ పర్చలేదని, ప్రయాణికులను కాపాడటంలో ముందుంటుందని కొనియాడారు. ప్రాణాలను ఫణంగా పెట్టి ఇలాంటి రిస్కులు చేయొద్దని.. ఒక రైలు పోతే మరో రైలు వస్తుందని.. ప్రాణం పోతే మళ్లీ వస్తుందా? అని మరో నెటిజన్ ప్రశ్నించారు.

English summary
Alert RPF personnel managed to save the life of a man who slipped while trying to board a moving train at the Ahmedabad railway station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X