చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మహిళల ఇన్నర్‌వేర్ తప్ప మిగతావి ముట్టుకోడు.. సీసీటీవీ కెమెరాకు చిక్కినా..

|
Google Oneindia TeluguNews

చెడ్డీలు మాత్రమే ధరించి దొంగతనాలకు పాల్పడే క్రిమినల్ గ్యాంగుల గురించి చాలానే విన్నాం.. కానీ వీడు మాత్రం అదో రకం.. చెడ్డీలను మాత్రమే కొట్టేస్తాడు.. అది కూడా మహిళల ఇన్నర్ వేర్ తప్ప మిగతా వస్తువులేవీ ముట్టుకోడు.. కొద్దిరోజులుగా ఆరేసిన దుస్తులు మాయమైపోవడాన్ని గుర్తించిన మహిళలు మొదట హడలిపోయారు.. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు..

 ఆ దృశ్యాలు చూసి షాక్..

ఆ దృశ్యాలు చూసి షాక్..

చెన్నై సిటీలోని అడంబాకం ఏరియాకు చెందిన కొందరు మహిళలు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో ఆరేసిన ఇన్నర్ వేర్స్ తరచూ మాయమైపోతున్నాయని, ఏం జరుగుతుందో తెల్సుకోడానికి సీసీటీవీ కెమెరాలను చెక్ చేయగా షాకింగ్ విషయం బయటపడిందని చెప్పుకొచ్చారు. ముఖం కనపడకుండా ముసుగు ధరించిన ఓ దొంగ.. ప్రహారీ గోడదూకి కాపంపౌండ్ లోకి ప్రవేశించడం.. చప్పుడు కాకుండా ఇండ్లలోకి దూరడం.. ఆ తర్వాత ఆరేసిన లోదుస్తుల్ని తీసుకుని వెళ్లిపోవడం లాంటి దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి.

అచ్చం ప్రొఫెషనల్ మాదిరి..

అచ్చం ప్రొఫెషనల్ మాదిరి..

ఫిర్యాదుదారుల ఇండ్లలోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు కూడా దొంగ తీరును చూసి అవాక్కయ్యారు. వాడి కదలికలు పక్కా ప్రొఫెషనల్ దొంగలా ఉన్నాయని, అయితే మహిళల ఇన్నర్ వేర్స్ తప్ప.. ఏ ఇంట్లోనూ మిగతా వస్తువులేవీ ముట్టుకునేవాడుకాదని, వేలి ముద్రలు పడకుండా చేతులకు గ్లవ్స్ ధరించాడని పోలీసులు చెప్పారు.

అనుమానం రాకుండా..

అనుమానం రాకుండా..

మహిళల ఇన్నర్ వేర్స్ ఎత్తుకెళ్లే దొంగ.. తనపై ఏమాత్రం అనుమానం రాకుండా ఉండేలా తరచూ ఏరియాల్ని మార్చేవాడని, ఒకరోజు ఒక ఏరియాలో దొంగతనాలు చేస్తే తర్వాతి రోజు దూర ప్రాంతాలను టార్గెట్ చేసేవాడని పోలీసులు తెలిపారు. సీసీటీవీలో రికార్డైన ముసుగు ముఖం ఆధారంగా నిందితుడి ఊహాచిత్రాన్ని గీయించి, వాడికోసం గాలిస్తున్నట్లు అడంబాకం స్టేషన్ చీఫ్ వెల్లడించారు. గతంలో బెంగళూరులోని ఓ లేడీస్ హాస్టల్ నూ ఇలాంటి దొంగతనం జరగడం, సీసీటీవీ రికార్డుల ఆధారంగా నిందితుణ్ని పోలీసులు పట్టుకోవడం తెలిసిందే.

English summary
The Chennai police are on the lookout for a man who has allegedly been stealing women's lingerie in Adambakkam area
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X