వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

4 గంటల్లో 23సార్లు ఆగిన గుండె, ఐనా బతికాడు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

కొచ్చి: అరవై ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తికి నాలుగు గంటల వ్యవధిలో 23 సార్లు గుండెపోటు వచ్చినప్పటికీ బతికి బట్టకట్టాడు. ఈ ఘటన కేరళలోని కొచ్చిలో జరిగింది. 60 ఏళ్ల ఆ వ్యక్తి తన మనవడితో క్రికెట్ ఆడుకుంటుండగా గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

అక్కడ ఈసీజీ తీయగా ఆయనకు గుండెపోటు వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో అతనికి చికిత్స చేసేందుకు వారు ప్రయత్నించగా అందుకు ఆయన శరీరం సహకరించలేదు. అంతేకాదు, పదేపదే గుండె ఆగిపోసాగింది. దీంతో ఆయనను ఆస్టర్ మెడిసిటీ ఆసుపత్రికి తరలించారు.

man survives despite having 23 cardiac arrests in 4 hours

అక్కడ ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయనకు గుండెపోటు రాగానే తొలి గంటలో అందాల్సిన వైద్యం అందలేదని చెప్పారు. అందువల్లే 23సార్లు ఆయన గుండె ఆగిందని చెప్పారు. ఇప్పుడు స్టెంట్ వేశామని, క్షేమంగానే ఉన్నారని చెప్పారు.

అయితే అది కేవలం 30 శాతం రక్తాన్ని మాత్రమే పంపింగ్ చేస్తోందని వారు తెలిపారు. అయినా అసలు నాలుగు గంటల్లో 23సార్లు గుండె ఆగడం చిన్న విషయం కాదని అంటున్నారు. వైద్యులు స్టెంట్ వేయడం ద్వారా బ్లాకును క్లియర్ చేశారు. ఇక నుంచి ఆయన వేగాన్ని తగ్గించుకోవాలని చెప్పారు.

English summary
man survives despite having 23 cardiac arrests in 4 hours
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X