వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తిరుగులేని నేత మోడీ: గాలి లేకున్నా చేసి చూపించారు

By Pratap
|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: తాను తిరుగులేని నాయకుడినని ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి నిరూపించుకున్నారు. గాలి లేకున్నా ఎన్నికల్లో విజయం సాధించడం ఎలాగో ఆయన గుజరాత్ ఎన్నికల ద్వారా చేసి చూపించారు.

ఆరోసారి వరుసగా గుజరాత్‌లో బిజెపి విజయం సాధించింది. ఈ విజయం వెనక ఉన్నది ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కాదు, అలాగే బిజెపి అధ్యక్షుడు జితు వఘాని కూడా కాదు. ఆ విజయం తప్పకుండా ప్రధాని నరేంద్ర మోడీదే.

మోడీ ఇలా చేశారు...

మోడీ ఇలా చేశారు...

గుజరాత్ రాష్ట్రవ్యాప్తంగా మోడీ విస్తృత ప్రచారం సాగించారు. ప్రచార సమయంలో ఆయన బిజెపి అగ్రనేతగా కనిపించారు, ప్రధానికి కాస్తా తక్కువగా అనిపింారు. ఆయన ఎక్కువగా గుజరాత్ అస్తిత్వం గురించి, గుజరాత్ ఆత్మగౌరవం గురించి మాట్లాడారు గతంలో బిజెపి చేసిన తప్పులను క్షమించాలని ఆయన ఓటర్లను కోరారు. అది ఏదైనా కానీయండి జిఎస్టీ కావచ్చు, పెద్ద నోట్ల రద్దు కావ్చచు, గ్రామీణుల్లో అసంతృప్తి కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో నిర్లిప్తత కావచ్చు.

ఓటర్లు విన్నట్లే ఉన్నారు..

ఓటర్లు విన్నట్లే ఉన్నారు..

మోడీ మాటలను ఓటర్లు సానుకూలంగానే తీసుకున్నట్లున్నారు. అయితే, ఓ హెచ్చరికలాంటిది కూడా చేశారు. బిజెపి సీట్ల సంఖ్య 117 నుంచి 107కు పడిపోయింది. కాంగ్రెసు సీట్ల సంఖ్య 61 నుంచి 74కు పెరిగింది. రాష్ట్రంలో 150 సీట్లు గెలుస్తామని బిజెపి అధ్యక్షుడు అమిత్ షా మాటలు నిజం కాలేదు.

పాత కాంగ్రెసు కాదని...

పాత కాంగ్రెసు కాదని...

కాంగ్రెసు అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు ప్రాంతీయ మిత్రులు హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జగ్నేష్ మేవాని ఇది పాత కాంగ్రెసు కాదని బిజెపికి చెప్పినట్లయింది. కాంగ్రెసు స్ఫూర్తిదాకమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తుందని చూపించారు.

అయితే మోడీ ఇలా నిరూపించారు..

అయితే మోడీ ఇలా నిరూపించారు..

దేశంలోని తాను మాత్రమే తిరుగులేని నాయకుడినని, తనకు దగ్గరగా వచ్చే నాయకుడు ఎవరూ లేరని నరేంద్ర మోడీ నిరూపించారు. పార్టీలో కూడా తనకు సమానమైన నాయకుడు లేడని నిరూపించారు. భవిష్యత్తులో అలాంటి నాయకులు వస్తారని కూడా అనుకోవడానికి వీలు లేకుండా మోడీ గుజరాత్ ఫలితాలను రాబట్టారు.

వారి యుగం ముగిసింది..

వారి యుగం ముగిసింది..

బిజెపిలో అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కె అద్వానీ యుగం పూర్తిగా ముగిసినట్లే. మోడీ తన స్థానాన్ని, అధికారాన్ని పదిలపరుచుకున్నారు. ఆయనకు సవాల్ విసిరే వారు ఆయనకు దగ్గరలో ఎవరూ లేరు. గత వారంలో మోడీ దూకుడుగా చేసిన ప్రచారం బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ ప్రచారంలో గాలి లేదు. రాహుల్ గాంధీ, హార్దిక్ పటేల్ ప్రసంగాలకు ప్రజలు ఊగిపోయినట్లు కనిపించారు. అయినా, మోడీ గుజరాత్‌ను బిజెపికి మరోసారి కట్టబెట్టారు.

English summary
For the sixth consecutive time, the BJP has won Gujarat and the man of the moment is again Prime Minister Narendra Modi, not chief minister Vijay Rupani, not BJP state president Jitu Vaghani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X