వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఫైన్ వేస్తే.. బండిని పడేసి, తన్ని.. బోరున ఏడ్చిన వాహనదారుడు.. (వీడియో)

|
Google Oneindia TeluguNews

కొత్త మోటారు వాహన చట్టంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు వేలకు వేలు ఫైన్ వేయడంతో ఆందోళన చెందుతున్నారు. చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ల గ్యాప్ తర్వాత మరో ఘటన వెలుగుచూసింది. యూపీలోని మీరట్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.

priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్priyanka reddy: నిందితుల ఇళ్లల్లో పరిస్థితి ఇది, మహ్మద్ యజమాని శ్రీనివాస్ అరెస్ట్

 రూ.వెయ్యి ఫైన్..

రూ.వెయ్యి ఫైన్..

కొత్త మోటారు వాహన చట్టం ప్రకారం హెల్మెట్ పెట్టుకోని వాహనదారుడి రూ. వెయ్యి రూపాయల ఫైన్ విధించే వెసులుబాటు ఉంది. దీంతోపాటు డ్రైవింగ్ లైసెన్స్ తాత్కాలికంగా రద్దు చేసే ఛాన్స్ కూడా ఉంది. ఈ క్రమంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మీరట్ పోలీసులు కూడా జరిమానా విధిస్తున్నారు. ఇంతలో అక్కడికి ఓ యువకుడు వచ్చాడు.

 హెల్మెట్ లేదని..

హెల్మెట్ లేదని..

అతనికి హెల్మెట్ లేకపోవడంతో పోలీసులు ఫైన్ వేశారు. దీంతో పోలీసుల తీరుపై మండిపడకుండా విచిత్రంగా ప్రవర్తించాడు. తన బండిని కిందపడేసి పిచ్చిగా బిహేవ్ చేశాడు. అటు ఇటుగా పడేసి.. సీటు కవర్ చించేశాడు. చివరికి బండి మీద కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. యువకుడి ప్రవర్తనతో ట్రాఫిక్ పోలీసులే కాదు.. అక్కడున్న వారు కూడా షాక్‌నకు గురయ్యారు.

ఓదార్చి..

ఓదార్చి..

తర్వాత ట్రాఫిక్ పోలీసులు వచ్చి యువకుడికి సర్దిచెప్పారు. బాబు అంటూ ఓదార్చారు. ఫైన్ వద్దు ఏం వద్దులే అని నచ్చజెప్పారు. వారి సూచనతో యువకుడు అంగీకరించి.. అక్కడినుంచి జారుకోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో వౌరల్

యువకుడి ప్రవర్తనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. 43 సెకన్ల నిడివిగల వీడియో ఇప్పటికే 11 వేల సార్లు షేర్ చేశారు. చాలామంది రీ ట్విట్ కూడా చేశారు. చాలామంది కామెంట్ల్ చేశారు.

English summary
A biker in Uttar Pradesh's Meerut was handed a challan for not wearing a helmet. Upset about being fined, the biker broke down and tossed his bike twice on the road.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X