• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

భార్యను కిడ్నాప్ చేశారని స్టేషన్‌కు వెళ్లిన భర్త.. పోలీసులు ఏం చేశారంటే..?

|

మెయిన్‌పురి : పోలీసులు... ఆ మాట వింటేనే ఇప్పటికీ చాలా మంది వణికిపోతారు. అలాంటి ఖాకీ మార్కు అలా ఉంటుంది మరి. ఫ్రెండ్లీ పోలీసింగ్ అని, ప్రజల కోసమే మేమున్నామంటూ వారు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు మాత్రం నమ్మే పరిస్థితి లేదు. అందుకు కారణం వారు వ్యవహరించే తీరు. పోలీసులపై నమ్మకం కోల్పోయే ఇలాంటి ఓ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. తన భార్యను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని స్టేషన్ గడపతొక్కిన పాపానికి ఓ వ్యక్తికి ఖాకీలు థర్డ్ డిగ్రీ టార్చర్ పెట్టి నరకం చూపారు.

నిద్రమత్తులో డ్రైవర్.. కాల్వలో పడిపోయిన బస్సు.. 29 మంది మృతి

బైక్‌పై వెళ్తుండగా భార్య కిడ్నాప్

బైక్‌పై వెళ్తుండగా భార్య కిడ్నాప్

ఎస్పీ నేత ములాయం సింగ్ యాదవ్ నియోజకవర్గమైన మెయిన్‌పురిలోని బులంద్ షహర్‌కు చెందిన వ్యక్తి తన భార్యతో కలిసి బంధువుల ఇంటికి బయలుదేరాడు. ఆ దంపతులు మోటార్ బైక్‌పై అలీగఢ్ - కాన్పూర్ హైవేపై వెళ్తుండగా కారులో వచ్చిన ముగ్గురు దుండగులు వారిని అడ్డగించారు. మహిళను కిడ్నాప్ చేశారు. అడ్డుకోబోయిన భర్తపై దాడి చేశారు. దీంతో అతను స్పృహ కోల్పోయాడు.

పోలీసులను ఆశ్రయించిన భర్త

పోలీసులను ఆశ్రయించిన భర్త

కాసేపటికి స్పృహలోకి వచ్చిన భర్త సాయం కోసం పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన విషయం చెప్పి కిడ్నాపైన తన భార్యను కాపాడమని కోరాడు. అయితే సాయం చేయాల్సిన పోలీసులు ఫిర్యాదు చేసేందుకు వచ్చిన భర్తనే అనుమానించారు. పెళ్లాన్ని చంపేసి తమ వద్దకొచ్చి నాటకాలాడుతున్నాడని అతన్ని చావ చితకబాదారు. తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడంటూ ఖాకీలు థర్డ్ డిగ్రీ ప్రయోగించడంతో బాధితుడి చేతి వేళ్లు రెండు విరిగిపోయాయి. మెడతో పాటు కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయి.

 రేప్ చేశారని భార్య కంప్లైంట్

రేప్ చేశారని భార్య కంప్లైంట్

భర్తకు నరకం చూపించిన కొన్ని గంటల తర్వాత అతని భార్య పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది. తనను ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి, తన వద్దనున్న బంగారం దోచుకుని తనను నిర్జన ప్రదేశంలో వదిలేశారని ఫిర్యాదు చేసింది. దీంతో పోీలసులు ఎట్టకేలకూ ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులపై రేప్, కిడ్నాప్, దోపిడి కేసు బుక్ చేశారు. ఫిర్యాదుచేసేందుకు వచ్చిన వ్యక్తిపై జులుం ప్రదర్శించిన ఖాకీల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బిచ్వాన్ పోలీస్ స్టేషన్.. స్టేషన్ హౌస్ ఆఫీసర్ రజనీష్ పాల్ సింగ్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఇదిలా ఉంటే మెడికల్ రిపోర్టులో మహిళపై అత్యాచారం జరగలేదని, ఆమె ఒంటిపై గాయాలేమీ లేవని తేలిందని పోలీసులు చెప్పడం విశేషం.

English summary
A man was allegedly subjected to third-degree torture when he went to file a complaint about kidnapping of his 38-year-old wife from the Aligarh-Kanpur highway in Mainpuri area in Uttar Pradesh.After the woman alleged gangrape, police registered a case against three unidentified youths.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X