వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గర్ల్‌ఫ్రెండ్ కోసం సాహసం, ఊచలు లెక్కబెడుతున్న నేత

|
Google Oneindia TeluguNews

అలీగఢ్ : ప్రేమ అదో గమ్మత్తైన లోకం. ప్రేమలో ఉన్నప్పుడు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చి, పుచ్చుకోవడం కామన్. కానీ ఓ నేత మాత్రం తన ప్రేయసి కోసం ఏకంగా ఎగ్జామ్ పేపర్ లీక్ చేసి కటకటల పాలయ్యాడు. యూపీలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

పేపర్ లీక్ చేసి ..

పేపర్ లీక్ చేసి ..

ఫిరోజ్ అలం రాజా .. బీఎస్పీ నేత. పార్టీలో కూడా మంచి పేరుంది. కానీ ఇతగాడికి ఓ లవర్ ఉంది. అదే అతడి వీక్‌నెస్. ఆమె ప్రోద్బలంతో చేసిన పని వల్ల జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. తన గర్ల్‌ఫ్రెండ్ అలీగఢ్ వర్సిటీలో ఎంబీఏ చదువుతుంది. ఇంతవరకు బానే ఉంది. కానీ తాను చదివి పాసవుదామని అనుకోలేదు. దొడ్డిదారిన పేపర్ లీక్‌తో పట్టా పొందాలనుకుంది. దీంత తన లవర్‌ను పురామయించింది. అతడు తొలుత నిరాకరించిన .. తర్వాత తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇది వర్కవుట్ అవుతుందో లేదోననే సందేహంతో ఓ నకిలీ పేపర్ ఇచ్చి చూశాడు. అదీ చూసి .. నిర్ధారించుకొన్న గర్ల్ ఫ్రెండ్ నకిలీదని తేలడంతో .. యువనేతతో మాట్లాడటం మానేసింది. దీంతో అల్లాడిన రాజా ఎగ్జామ్ పేపర్ లీక్ చేసేందుకు స్కెచ్ వేశాడు.

ప్రణాళిక ప్రకారం ..

ప్రణాళిక ప్రకారం ..

ఎగ్జామ్ పేపర్ కోసం రాజా చాలామందిని కలిశాడు. హైదర్ అనే వ్యక్తి ద్వారా ఇర్షాద్ పరిచయమయ్యాడు. ఇర్షాద్ అలీగఢ్ వర్సిటీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన రాజా .. తాను అడిగిన పేపర్ ఇవ్వాలని కోరాడు. అలా చేస్తే వర్సిటీలో ఉద్యోగాన్ని పర్మినెంట్ చేస్తానని భరోసానిచ్చాడు. తన కొలువు పర్మినెంట్ అవుతుందనే ఆశతో ఎంబీఏ ఎగ్జామ్ పేపర్‌ను రాజాకు అందజేశాడు. దానిని తన లవర్‌కు అందజేశాడు రాజా. పేపర్ లీకేజీ వ్యవహారం దీనితో సరిపోలేదు. మిగతావారికి కూడా రూ.2 వేలకు ఒక పేపర్ విక్రయిస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో విషయం బయటపడింది.

ఊచలు లెక్కబెడుతున్నారు ..

ఊచలు లెక్కబెడుతున్నారు ..

పేపర్ లీకేజీకి సంబంధించి రాజా, ఇర్షాద్, హైదర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని జైలుకు తరలించారు. రాజా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం పరారీలో ఉన్నారు. హైదర్ ప్లాట్‌ను తనిఖీ చేశామని పోలీసులు వెల్లడించారు. వీరంతా ఇక్కడే కలిసే వారని వారు చెప్తున్నారు. హైదర్ మామ తసీమ్ సిద్దిఖీ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో దగ్గర వ్యక్తి. హైదర్, ఇర్షాద్ ఓ గ్యాంగ్‌గా ఏర్పడింది. వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేసింది. ఒక్కో పేపర్ రూ.2 వేలకు విక్రయించిందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

English summary
Feroz Alam a.k.a. Raja had considerable political clout till about a day ago.On Monday, Raja was arrested for getting the MBA paper leaked. He confessed that he wanted to get the paper leaked to help his girlfriend who was taking the MBA examination and he used an AMU employee, Irshad, to get the paper. He promised to get a permanent job in the university for Irshad. Raja, who has now been arrested and sent to jail, told the police that he had promised his girlfriend that he could obtain the examination paper.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X