వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సరదా కోసం కుక్కకు ఆధార్ కార్డు దరఖాస్తు: అరెస్టు చేసి జైల్లో పెట్టారు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన కుక్కకి ఆధార్ కార్డు కావాలని దరఖాస్తు చేసుకున్నాడు ఓ వ్యక్తిని పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గాజిపూర్ జిల్లా రాజాపూర్‌ గ్రామంలో జరిగింది.

ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తోన్న మనీష్ కుమార్ గత మార్చిలో ఓ కుక్క ఫోటోతో పాటు తప్పుడు సమాచారాన్ని దరఖాస్తు ఫామ్‌లో నింపి ఆన్‌లైన్‌లో అప్లై చేశాడు. కుక్క ఫోటోతో ఉన్న దరఖాస్తు ఫారమ్ ఉన్నాతాధికారులు దృష్టిలో పడటంతో ఆ దరఖాస్తుని తిరస్కరించారు.

Man tries to get Aadhaar card for a dog, booked

ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని చూసిన అతనిపై ప్రభుత్వ అధికారులు కేసు పెట్టారు. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అతడిపై సెక్షన్ 469 కింద బహారియాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణలో తాను కేవలం సరదా కోసమే కుక్క ఫోటోని అప్‌లోడ్ చేశానని కంప్యూటర్ ఆపరేటరైన మనీష్ కుమార్ వెల్లడించినట్లు తెలిపారు.

English summary
Computer operator of a private company found himself in a spot after he attempted to enroll a dog for issuing unique identification number. Manish Kumar uploaded the picture of a dog and furnished fake details for enrollment, during a camp for Aadhar card enrollment in Rajapur village in Ghazipur district in the first week of March.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X