• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మత పిచ్చి వినియోగదారుడికి పోలీసుల నోటీసులు ? వివరణ ఆధారంగా చర్యలన్న ఎస్పీ

|
  MP Police To Send Notice To Twitter User Who Complained About Zomato’s ‘Non-Hindu Delivery Boy’

  భోపాల్ : వసుదైక భారతదేశంలో కుల, మతాలకు తావులేదు. లింగ భేదం పట్టింపుల్లు లేనేలేవు. కానీ మధ్యప్రదేశ్‌లో అమిత్ శుక్లా అనే మత ఛాందసవాది హిందుయేతర వ్యక్తి ఫుడ్ తీసుకొచ్చాడని ఆర్డర్ క్యాన్సిల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై పోలీసులు దృష్టిసారించించారు. శుక్లా నోటీసులు జారీచేస్తామనే సూచనప్రాయంగా తెలిపారు. దీంతో కుల, మత భేదాలు చూపి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడానికి ఏ మాత్రం వెనుకాడబోమని సంకేతాలిచ్చారు మధ్యప్రదేశ్ పోలీసులు.

  నోటీసులు జారీచేస్తాం ..

  నోటీసులు జారీచేస్తాం ..

  జొమాటో జరిగిన ఘటన తమ దృష్టికొచ్చిందని తెలిపారు జబల్ పూర్ ఎస్పీ అమిత్ సింగ్. దీనిపై సంబంధింత వ్యక్తి అమిత్ శుక్లా నోటీసులు అందజేస్తామని తెలిపారు. దానికి ఆయన ఇచ్చే సమాధానం బట్టి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఒకవేళ నిజంగా తాను హిందువేయత వ్యక్తి తీసుకొచ్చిన ఆహారం తీసుకోలేదని విచారణలో శుక్లా చెబితే చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మతపరంగా బేధం చూపడం నేరం, శుక్లా అలా చేయడం సరికాదు .. అని వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తమకు ఇంకా ఎవరూ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయలేదన్నారు. సోషల్ మీడియా వేదికగా జరిగిన సంభాషణను సుమోటోగా తీసుకొని నోటీసులు జారీచేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు వివరించారు.

  ఎందుకు తిరస్కరించానంటే ..

  ఎందుకు తిరస్కరించానంటే ..

  శుక్లా ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. తన చర్యను సమర్థించుకున్నారు శుక్లా. మత విధానాలపై ప్రశ్నించాలనుకుంటే .. వారు ముందుగా తన మతాన్ని గౌరవించాలని కొత్త భాష్యం చెప్పారు. అంతేకాదు ఇదీ శ్రావణ మాసమని, తాను ఉపవాసం ఉంటానని కూడా చెప్పుకొచ్చారు. అందుకోసమే తాను విజిటేరియన్ రెస్టారెంట్ కూడా ఫుడ్ ఆర్డర్ చేశానని పేర్కొన్నారు. దీనిపై జొమాటోకే రిక్వెస్ట్ కూడా పెట్టానని .. కానీ వారు పట్టించుకోకుండా వివాదం చేశారని ఆరోపించారు. తనకు తెలిసి తాను తప్పుచేయలేదని సమర్థించుకున్నారు శుక్లా.

  ఏం జరిగిందంటే ..

  ఏం జరిగిందంటే ..

  జబల్‌పూర్‌కి చెందిన శుక్లా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేశారు. అయితే ఫుడ్ డెలివరీ చేసేందుకు ముస్లిం వచ్చాడు. దీంతో తనకు మరో డెలివరీ బాయ్‌ను పంపమని అడగడంతో వివాదం చెలరేగింది. దీనికి జొమాటో ధీటుగా స్పందించింది. మరో డెలివరీ బాయ్‌ను పంపించమని జొమాటో స్పష్టంచేసింది. తనకు శ్రావణమాసం అని చెప్పిన .. తమకు కుల, మతాలు ఉండవని జొమాటో తేల్చిచెప్పింది. వీరి సంభాషణ సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేయడంతో వైరలైంది. జొమాటో చేసిన పనిని నెటిజన్లు ప్రశంసించారు. కానీ తర్వాత కొందరు నాన్ హలాల్ ఫుడ్ పంపిస్తున్నారని జొమాటోను అన్ ఇన్ స్టాల్ కూడా చేశారు. జొమాటోకు హిందుత్వ అజెండాను అంటకట్ట ప్రచారం చేశారు. ఈ క్రమంలో వివాదానికి కారణమైన శుక్లాకు నోటీసులు జారీచేయాలనే యోచనలో ఉన్నారు జబల్ పూర్ పోలీసులు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Madhya Pradesh police have decided to send a notice to a man in Jabalpur who took offence after he was assigned a “non-Hindu” delivery boy by Zomato for his food order. Amit Singh, superintendent of police in Jabalpur, said, “We are going to send a notice to the man to explain his conduct. If it is true, it amounts to hurting religious sentiments of people. This is a crime.” According to the SP, no one has lodged a complaint but the police have taken suo moto notice of the Twitter post and has decided to send a notice.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more