వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎస్‌బీఐ ఏటీఏంలో పిల్లలు ఆడుకునే నోట్లు పెట్టిన వ్యక్తి అరెస్ట్

ఎస్‌బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్‌బీఐ ఏటీఎంలో చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు రావడానికి కారకుడైన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడైన మహమ్మద్ ఇషా అనే వ్యక్తిని పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ప్రతాప్ గఢ్ లో అదుపులోకి తీసుకున్నారు.

ద‌క్షిణ ఢిల్లీలోని సంగ‌మ్ విహార్‌లో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో బుధవారం చిన్నపిల్లలు ఆడుకునే నకిలీ రూ.2000 నోట్లు వచ్చిన సంగతి తెలిసిందే. చూడటానికి ఇవి అస‌లు నోట్లుగానే క‌నిపించినా.. ఈ నోటుపై ఆర్బీఐకి బ‌దులుగా చిల్డ్ర‌ెన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని, గ్యారెంటీడ్ బై చిల్డ్ర‌న్స్ గ‌వ‌ర్న్‌మెంట్ అని ఉంది. నోటుపై ఒకపక్క చూర‌న్ లేబుల్ అనిరాసి ఉంది. బ్యాంకు సీల్‌కు బ‌దులుగా పీకే లోగో ఉంది.

Man who deposited fake notes in SBI ATM arrested

ద‌క్షిణ ఢిల్లీలోని చ‌త్తార్‌పూర్‌ కాల్‌సెంట‌ర్లో ప‌నిచేసే రోహిత్ అనే వ్య‌క్తికి మొద‌ట‌గా ఈ న‌కిలీ నోట్లు రాగా ఈ సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ ఘటనపై ఆ బ్యాంకు అధికారులు కూడా విచారణ చేపట్టారు.

నిందితుడు మహమ్మద్ ఇషా ఏటీఎంలలో నగదు పెట్టే బాధ్యత చేపట్టిన కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడని, అతడే పిల్లలు ఆడుకునే నోట్లను సంగ‌మ్ విహార్‌ ఏటీఎంలో పెట్టాడని పోలీసులు తెలిపారు.

English summary
The police have arrested one Mohammad Isha after he put fake notes in an SBI ATM in Delhi. He was arrested from Pratapgarh in Uttar Pradesh. He is an employee of a company that is responsible for putting cash in ATMs, police said. On Wednesday, a State Bank of India ATM in South Delhi dispensed fake Rs 2,000 notes with ‘Children Bank of India’ written on them instead of Reserve Bank of India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X