బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరు మెజస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్ లో రివాల్వర్ కలకలం, భద్రతా సిబ్బందితో, హిందిలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరులోని మెజస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్ (నమ్మ మెట్రో)లోకి రివాల్వర్ తో చొరబడటానికి ప్రయత్నించిన వ్యక్తి అక్కడి భద్రతా సిబ్బంది కళ్లుకప్పి చాకచక్యంగా పరారైనాడు. రివాల్వర్ తో మెట్రో రైల్వేస్టేషన్ లోకి చొరబడటానికి ప్రయత్నించిన వ్యక్తి కోసం పోలీసులు ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు.

పోలీసుల కథనం మేరకు మే 6వ తేది రాత్రి 8.30 గంటల సమయంలో బెంగళూరు నగరంలోని మెజస్టిక్ మెట్రో రైల్వేస్టేషన్ లోకి రివాల్వర్ తో 40 ఏళ్ల వ్యక్తి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి మెటల్ డిటెక్టర్ ద్వారా లోపలికి వెళ్లడానికి విఫలయత్నం చేశాడు.

Man with pistol found in Bengaluru majestic metro station

మెటల్ డిటెక్టర్ లో అతని దగ్గర రివాల్వర్ ఉన్న విషయం అక్కడి భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే ఆ వ్యక్తి అక్కడి సిబ్బంది కళ్లుగప్పి అక్కడి నుంచి పరారైనాడు. రివాల్వర్ ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి అక్కడి సిబ్బంది విఫలయత్నం చేపి చివరికి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

విషయం తెలుసుకున్న డీసీపీ రవి చెన్ననవర్, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రివాల్వర్ తో వచ్చిన వ్యక్తి పోడువుగా గడ్డం పెట్టుకున్నాడని, అతను హిందీ మాట్లాడాడని మెట్రో సిబ్బంది సమాచారం ఇచ్చారని డీసీపీ రవి మీడియాకు చెప్పారు. మెట్రో రైల్వేస్టేషన్ లోని సీసీ కెమెరాలు పరిశీలించిన అధికారులు అతని కోసం గాలిస్తున్నారు.

శ్రీలంకలో వరుస బాంబు పేలుళ్లు జరిపిన నిందితులు బెంగళూరు చేరుకున్నారని ప్రచారం జరుగుతున్న సమయంలో మెట్రో రైల్వేస్టేషన్ లోకి రివాల్వర్ తో ఒకరు చొరబడటంతో ప్రజలు హడలిపోతున్నారు. మెట్రో రైల్వేస్టేషన్ల దగ్గర పోలీసులు కట్టుదిట్టమైన భ్రదతా ఏర్పాట్లు చేశారు.

English summary
Man with pistol found in Bengaluru majestic metro station on May 6th night. Police visited the spot and sized CCTV footage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X