వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పనిచేస్తున్న సంస్థకే కన్నం.. 58 కిలోల బంగారం మాయం

|
Google Oneindia TeluguNews

ఔరంగాబాద్ : ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు. అదే కోవలో ఓ నగల షాపు మేనేజర్ చాలా రోజులుగా సంస్థకు కన్నం వేస్తున్నా గుర్తించలేకపోయారు యజమానులు. చివరకు వాడి వాలకం చూసి అనుమానం వచ్చి ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కిలోలకొద్దీ బంగారం మాయం చేశాడు ఆ చోరాగ్రేసరుడు.

ఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజఏనుగుకు స్వాతంత్ర్యం వచ్చిన వేళ.. గజ"రాజు" వేడుకలు (వీడియో)

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో వెలుగుచూసిన ఘటన నగల షాపుల నిర్వాహకులను విస్మయానికి గురిచేస్తోంది. పనోళ్లతో జాగ్రత్తగా ఉండాలనే ఇండికేషన్ ఇస్తోంది. సమర్థ్ నగర్ లో ఉన్న వమన్ హరి పెథే జ్యువెల్లరీ షాపులో జరిగిన చోరీ దేశవ్యాప్తంగా చర్చానీయాంశమైంది. స్టోర్ మేనేజర్ మరో ఇద్దరు ఉద్యోగులతో కలిసి చేసిన దొంగతనం బయటపడింది.

Manager steals 58 kg gold from his own jewellery shop and arrested

పనిచేసే సంస్థకే కన్నం పెట్టారు ప్రబుద్ధులు. స్టోర్ మేనేజర్ గా పనిచేసిన అంకుర్ రాణే, తన కింద పనిచేస్తున్న సహోద్యోగులతో కలిసి ఏకంగా 58 కిలోల బంగారం మాయం చేశాడు. లోకేష్ జైన్, రాజేంద్ర జైన్ అనే ఇద్దరు ఉద్యోగులతో ఈ చోరీకి స్కెచ్ వేశాడు. యజమానికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మేనేజర్ ను అరెస్ట్ చేశారు. అతడు చెప్పిన వివరాల మేరకు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.

English summary
Three people, including the manager of a showroom of a jewellery store, were arrested for stealing gold weighing around 58 kg in Maharashtra's Aurangabad, police said on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X