• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మీకు గుర్తుందిగా.. జనవరి 1 నుంచి అమలులోకి కొత్త నిబంధనలు -ఫోన్ నంబర్‌కు ముందు 0 తప్పదు

|

కొనసాగుతోన్న కరోనా విలయం.. వ్యాక్సిన్ పంపిణీపై పాజిటివ్ న్యూస్‌తో 2020కి వీడ్కోలు పలకబోతున్నాం. మరో 10 రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. న్యూ ఇయర్ తోపాటే దేశంలో న్యూ రూల్స్ కొన్ని అమలులోకి రానున్నాయి. 20201 జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌తోపాటు జీఎస్టీ, చెక్ మోసాలు, పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌లాంటి వాటిలో నిబంధ‌న‌లు మారుతున్నాయి. వాటిపై ఓ లుక్కేస్తే..

ఫాస్టాగ్ (FASTag) త‌ప్ప‌నిస‌రి

ఫాస్టాగ్ (FASTag) త‌ప్ప‌నిస‌రి

రెండేళ్లలో భారత్ ను టోల్ గేట్ ఫ్రీ దేశంగా మారుస్తామని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హైవేలపై ఈ-చెల్లింపుల విధానాన్ని ముమ్మరం చేశారు. అందులో భాగంగానే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్టాగ్‌ను త‌ప్ప‌నిస‌రి చేస్తూ కేంద్ర రోడ్డు, ర‌వాణా, హైవేల మంత్రిశ్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం.. డిసెంబ‌ర్ 1, 2017కు ముందు త‌యారైన అన్ని నాలుగు చ‌క్రాల వాహ‌నాల‌కు ఫాస్టాగ్ త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందే. ఈ మేర‌కు కేంద్ర మోటారు వాహ‌నాల చ‌ట్టం, 1989లో స‌వ‌ర‌ణ‌లు చేశారు.

చెక్కుల పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌

చెక్కుల పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌

జ‌న‌వ‌రి 1, 2021 నుంచి చెక్కుల‌కు పాజిటివ్ పే వ్య‌వ‌స్థ‌ను తీసుకురానున్న‌ది రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). ఇందులో భాగంగా రూ.50 వేల‌కు మించిన చెక్కుల విష‌యంలో కీల‌క వివ‌రాల‌ను మ‌రోసారి నిర్ధారించాల్సిన అవ‌స‌రం రావ‌చ్చు. చెక్కు జారీ చేసే వ్య‌క్తి చెక్కు నంబ‌ర్‌, తేదీ, పేయీ పేరు, అకౌంట్ నంబ‌ర్‌, అమౌంట్ వంటి వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంటుంది.

 కాంటాక్ట్‌లెస్ కార్లు ప‌రిమితి పెంపు

కాంటాక్ట్‌లెస్ కార్లు ప‌రిమితి పెంపు

2021 జ‌న‌వ‌రి 1 నుంచి కాంటాక్ట్‌లెస్ కార్డ్ లావాదేవీ ప‌రిమితిని పెంచుతూ ఆర్బీఐ ఈ మ‌ధ్యే కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రూ.2 వేల ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచింది. అయితే ఇది పూర్తిగా వినియోగ‌దారు విచక్ష‌ణాధికారంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అంటే యూజ‌ర్ కావాల‌నుకుంటే ఈ ప‌రిమితిని రూ.5 వేల‌కు పెంచుకోవ‌చ్చు. లేదంటే రూ.2 వేలకే ప‌రిమితం చేయ‌వ‌చ్చు.

 జీఎస్టీ రిట‌ర్న్ ఫైలింగ్ సౌక‌ర్యం

జీఎస్టీ రిట‌ర్న్ ఫైలింగ్ సౌక‌ర్యం

దేశ‌వ్యాప్తంగా ఉన్న సుమారు 94 ల‌క్ష‌ల మంది చిన్న వ్యాపార‌స్థులు ఇక సులువ‌గా, మూడు నెల‌ల‌కు ఓసారి గూడ్స్ అండ్ స‌ర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) రిట‌ర్న్స్ ఫైల్ చేసే సౌక‌ర్యం క‌ల‌గ‌నుంది. ఏడాదికి రూ.5 కోట్ల లోపు అమ్మ‌కాలు ఉండే వ్యాపారాలు దీని కిందికి వ‌స్తాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌తి నెల ఒక‌టి చొప్పున 12 రిట‌ర్న్స్ ఇవ్వాల్సి వ‌చ్చేది. అయితే ఇక నుంచి మూడు నెల‌ల‌కోసారి నాలుగు రిట‌ర్న్స్ దాఖ‌లు చేస్తే స‌రిపోతుంది. ఈ సౌకర్యం కొత్త ఏడాది నుంచే అమలులోకి రానుంది.

ఫోన్ నంబర్‌కు ముందు సున్నా

ఫోన్ నంబర్‌కు ముందు సున్నా

ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేయాలంటే ఇకపై నంబర్ కు ముందు 0 త‌ప్ప‌నిసరిగా చేర్చాల్సిందే. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 15 నుంచి ల్యాండ్‌లైన్ నుంచి మొబైల్ ఫోన్‌కు కాల్ చేయాలంటే క‌చ్చితంగా ముందు 0 యాడ్ చేయాల్సిందేన‌ని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలిక‌మ్యూనికేష‌న్స్ (డీఓటీ) స్ప‌ష్టంచేసింది.

 టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు పెరుగుతాయ్‌

టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు పెరుగుతాయ్‌

కొత్త ఏడాదితో పాటు టూ వీల‌ర్‌, కార్ల ధ‌ర‌లు కూడా కొత్త‌వి రానున్నాయి. అన్ని త‌యారీ కంపెనీలు ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. దేశంలో అతి పెద్ద కారు త‌యారీ సంస్థ మారుతీ సుజుకీ.. మోడ‌ల్‌ను బ‌ట్టి రేట్లు పెంచ‌నుంది. ఇండియాలో త‌మ కార్ల ధ‌ర‌లు పెంచ‌నున్న‌ట్లు ఇప్ప‌టికే ఎంజీ మోటార్స్ ప్ర‌క‌టించింది. జ‌న‌వ‌రి నుంచి రెనాల్ట్ కార్ల ధ‌ర‌లు రూ. 28 వేల వ‌ర‌కు పెర‌గ‌నున్నాయి. ఇక టూవీల‌ర్ల‌లో హీరో మోటోకార్ప్ త‌మ వాహ‌నాల ధ‌ర‌లు రూ.1500 వ‌ర‌కు పెంచుతున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

English summary
From 1 January 2021, many rules are going to change, that includes implementation of Positive Pay system to curb cheque frauds, mandatory FASTags for all four-wheelers across India and new mode of Goods and Services Tax (GST) return filing facility for small businesses. So, before the new rules roll out, it is important to know them in advance.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X