వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

8 నెలల క్రితం పెళ్లి, ఉగ్రవాదుల దాడిలో వీరమరణం, జవాను భార్య ఆర్తనాదాలు, 15 రోజుల ముందు!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: త్వరలో వస్తాను, నిన్ను వెంటపెట్టుకుని వెలుతాను, కన్నీరు పెట్టుకోకుండా సంతోషంగా పంపించాలని ఇటీవల చెప్పి వెళ్లి నేడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని వీర శైనికుడి భార్య ఆర్తనాదాలు చేస్తున్నది. వివాహం జరిగి 8 నెలలు పూర్తి కాకుండా భర్త చనిపోయాడని తెలుసుకున్న సీఎర్పీఎఫ్ జవన్ భార్యను ఓదార్చడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు. అమ్మా నా భర్త నాకు కావాలి, ఆయన లేనిలోటు ఎవ్వరు తీరుస్తారు అని బాధితురాలు బోరునవిలపిస్తోంది. వీర జవాను భార్యకు పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు, స్థానికులు శుక్రవారం ధైర్యం చెప్పారు.

8 నెలల క్రితం పెళ్లి

8 నెలల క్రితం పెళ్లి

కర్ణాటకలోని మండ్యకు చెందిన గురు, కలావతి వివాహం 8 నెలల క్రితం జరిగింది. దంపతులు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారని వారి కుటుంబ సభ్యులు అంటున్నారు. గురు అంటే భార్య కలావతికి ఎంతో ప్రేమ అని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లో గురు సీఆర్ఫీఎఫ్ జావానుగా ఉద్యోగం చేస్తున్నాడు.

15 రోజులు సెలవులు

15 రోజులు సెలవులు

జమ్మూ కాశ్మీర్ లో విదులు నిర్వహిస్తున్న సైనికుడు గురు సెలవుల మీద ఇటీవల సొంత ఊరికి వెళ్లాడు. 15 రోజుల పాటు భార్య కలావతి, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నాడు. ఇటీవల ఉద్యోగానికి వెళ్లడానికి సిద్దం అయ్యాడు. ఆసమయంలో తాను ఒంటరిగా ఉండలేనని, తననుకూడా పిలుచుకుని వెళ్లాలని భార్య కలావతి భర్త గురుకు చెప్పింది. ఇప్పుడు కుదరదని, ఇంకోసారి వచ్చినప్పుడు తన వెంట తీసుకెళుతానని భార్య కలావతికి గురు నచ్చచెప్పి వెళ్లాడు.

ఒక్క ఫోన్ కాల్

ఒక్క ఫోన్ కాల్

శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో తన భర్త తనకు ఫోన్ చేశాడని, తాను ఎదోపనిలో ఉన్నానని తరువాత ఫోన్ చేస్తానని తాను చెప్పానని కలావతి బోరున విలపిస్తోంది. తరువాత తాను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తన భర్త గురు అందుబాటులోకి రాలేదని, రాత్రి అధికారులు ఫోన్ చేసి ఉగ్రవాదుల దాడిలో గురు మరణించాడని చెప్పారని వీరసైనికుడి భార్త కలావతి ఆర్తనాదాలు చేస్తోంది.

దేశం కోసం ప్రాణం

దేశం కోసం ప్రాణం

తన భర్త గురు ఎప్పుడు తనతోనే ఉండాలని తాను భావించానని, ఉగ్రవాదుల దాడిలో తన భర్త దూరం అయ్యాడని, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన తన భర్త ఆశయాలను గుర్తు పెట్టుకుని జీవిస్తానని కలావతి అంటోంది. వీరమరణం పొందిన జవాను గురు స్నేహితులు సైతం ఇటీవలే సెలవులు ముగించుకుని వెళ్లారని, త్వరలో వస్తానని చెప్పి నేడు శవమై వస్తున్నాడని విలపిస్తున్నారు.

English summary
Mandya martyred in deadly pulwama terror attack on CRPF personnel on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X