వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పురుషులే: మేనకా వివాదాస్పదం, ఇంద్రాణి మాటేంటి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర మంహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ సోమవారం నాడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజంలో జరుగుతున్న హింసకు పురుషులే కారణమని ఆమె విమర్శించారు. మగవాళ్లే హింసకు పాల్పడుతున్నారన్నారు.

లింగ సమానత్వంలో పురుషుల పాత్ర పెరగాలన్నారు. ఫేస్‌బుక్ యూజర్లతో ఆమె ఈ రోజు లైవ్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లింగ వివక్షను రూపుమాపేందుకు పాఠశాల స్థాయి నుంచే చర్యలు చేపట్టాలన్నారు.

Maneka Gandhi courts controversy, says all violence is male-generated

బాలికలను గౌరవించి, సాయం చేసే బాలురను ఎంపిక చేసి అవార్డులు ఇస్తామన్నారు. ఇందు కోసం కొద్ది నెలల క్రితం జెండర్ ఛాంపియన్స్ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి తరగతిలో ఒకరికి ఏడాదికి పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పారు. తెగువ ప్రదర్శించిన బాలికలకు అవార్డులు ఇస్తామన్నారు.

స్టాటికల్‌గా భారత దేశానికి ప్రతి ఏడు నిమిషాలకు మరో పాఠశాల కావాల్సి వస్తోందన్నారు. ప్రపంచంలోనే మనది లార్జెస్ట్ స్కూల్ సిస్టం అని చెప్పారు. అయితే, చాలామంది ఇటీవల హెడ్ లైన్స్‌లో నిలిచిన ఇంద్రాణి ముఖర్జీ పేరును చూపిస్తూ... కేవలం మగవారే కారణం కాదని అభిప్రాయపడ్డారు.

English summary
Courting controversy, union Minister for Women and Child Development Maneka Gandhi on Monday said that the role of men in gender sensitisation was critical since "all the violence is male-generated".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X