వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబ్రీ మసీదు ద్వంసం, రోగాలతో చస్తారు, క్షమాపణలు చెప్పం, ముస్లీం ఫేస్ బుక్ పేజ్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దివంగత నేత అనంత్ కుమార్ ను కించపరుస్తూ అవహేళనగా వ్యాఖ్యలు చేసిన మంగళూరు ముస్లీం పేస్ బుక్ పేజ్ అడ్మిన్ తాము తప్పుగా ఏమీ వ్యాఖ్యలు చెయ్యలేదని సమర్థించుకుంటున్నారు. బాబ్రీ మసీదు ద్వంసం చేసిన వారు రోగాలతో చస్తారని, అనంత్ కుమార్ పై తాము చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని, ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణలు చెప్పమని అంటున్నారు.

నేను ఉన్నాను, ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ: నివాళులు, నమ్మలేకపోతున్నా!నేను ఉన్నాను, ఫ్యామిలీకి ధైర్యం చెప్పిన ప్రధాని మోడీ: నివాళులు, నమ్మలేకపోతున్నా!

చచ్చారు చాలు

చచ్చారు చాలు

జాతి జాతి, రామా రామా అంటూ బ్రాహ్మణుడిగా మతోన్మాధి ముసుగు వేసుకుని ఇంత కాలం ప్రజలను మోసం చేసి మరణించావని, మళ్లీ నువ్వు పుట్టకూడదని మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ సోమవారం వివాదాస్పద కామెంట్స్ చేశారు.

దేశాన్ని నాశనం చేస్తావు

దేశాన్ని నాశనం చేస్తావు

నువ్వు మళ్లీ జన్మిస్తే దేశాన్ని నాశనం చేస్తావని, ఇప్పటికి చేసింది చాలని అనంత్ కుమార్ ను దూషిస్తూ ఫేస్ బుక్ లో కామెంట్స్ చేసిన మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ నిర్వహకులపై అనేక మంది మండిపడ్డారు. అనంత్ కుమార్ ను దూషించిన మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ నిర్వహకుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

క్షమాపణ చెప్పం

క్షమాపణ చెప్పం

అనంత్ కుమార్ ను దూషించామని మేము ఎందుకు క్షమాపణ చెప్పాలి ? అంటూ మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ నిర్వహకులు మరో కామెంట్ పోస్టు చేశారు. మతం మతం అంటూ అమాయకుల చావుకు కారణం అయ్యే వారి చావు త్వరగానే వస్తుందని, ఇలాంటి విషయాలు నిర్బయంగా చెప్పే మంగళూరు ముస్లీ ఫేస్ బుక్ పేజ్ అందరికంటే ఎంతో మేలు అని సమర్థించుకున్నారు.

సుమోటో కేసు

సుమోటో కేసు

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మరణంపై అనుచితంగా తీవ్రవ్యాఖ్యలు చేసిన మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కార్యకర్తలు, పలు ముస్లీం సంఘాలు డిమాండ్ చేశాయి. సోషల్ మీడియాలో అనంత్ కుమార్ మీద చేసిన వ్యాఖ్యలు గుర్తించిన మంగళూరు దక్షిణ విభాగంలోని పాండవేశ్వర పోలీసులు సమోటో కేసు నమోదు చేసుకుని విచారణ మొదలుపెట్టారు.

క్షమాపణలు చెప్పం

క్షమాపణలు చెప్పం

తాము చేసిన వ్యాఖ్యలు సమర్థించుకున్న మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ మరోసారి రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. అధికారం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని బాబ్రీ మసీదు ద్వంసం చేసిన సంఘ, సంస్థలకు తాము క్షమాపణలు చెప్పం అని సమర్థించుకున్నారు.

రోగాలతో చస్తారు

రోగాలతో చస్తారు

రథయాత్ర పేరుతో బాబ్రీ మసీదును ద్వంసం చేసి శిక్ష నుంచి తప్పించుకుని హాయిగా తిరిగిన వ్యక్తులు నేడు అనేక రోగాలతో మరణిస్తున్నారని, వారి ఆత్మశాంతించాలని కోరుకోవడం చాల తప్పు అని, వారికి దేవుడి దగ్గర తగిన సరైన శిక్షపడాలి అంటూ పరోక్షంగా అనంత్ కుమార్ ను కించపరుస్తూ ఫేస్ బుక్ లో మరోసారి అభ్యంతరకంగా పోస్టు చేశారు. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ఈ ఫేస్ బుక్ కు మంగళూరు ముస్లీం పేజ్ అనే పేరు పెట్టారు. విదేశాల నుంచి మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ నిర్వహిస్తున్నారని, అక్కడే ఈ అకౌంట్ అడ్మిన్ ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

English summary
Mangalore Muslim Facebook account admin, justified their stand on Union Minister Ananth Kumar death releated post.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X