వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చచ్చావు, మళ్లీ పుట్టి నాశనం చెయ్యద్దు: కేంద్ర మంత్రిపై ముస్లీం ఫేస్ బుక్ పేజ్ లో కామెంట్స్ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కేంద్ర మంత్రి అనంత్ కుమార్ అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన మరణంపై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేసి రాజకీయం చేస్తున్నారు. ఆరుసార్ల ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రిగా పని చేసిన వ్యక్తిని నీచంగా దూషిస్తూ నువ్వు చచ్చావు, మళ్లీ పుట్టి దేశాన్ని నాశనం చెయ్యద్దు అంటూ సోషల్ మీడియాలో మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ నిర్వహకులు ప్రచారం చేశారు. ఇలాంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అదే ముస్లీం వర్గానికి చెందిన పలువురు డిమాండ్ చేస్తున్నారు.

మళ్లీ పుట్టకూడదు

మళ్లీ పుట్టకూడదు

జాతి, రామ రామ అంటూ బ్రాహ్మణుడిగా, మతత్వవాదిగా ముసుగు వేసుకున్న వ్యక్తి అనంత్ కుమార్, దేశాన్ని నాశనం చెయ్యడానికి మరోసారి నువ్వు పుట్టకూడదు (జన్మించకూడదు) అంటూ మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశారు. ఇలాంటి పోస్టులు పోస్టు చేసి వికృత చేష్టలతో పలువురిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడుతున్నారు.

ముస్లీం సోదరులు ఫైర్

ముస్లీం సోదరులు ఫైర్

కేంద్ర మంత్రి అనంతకుమార్ ఆకస్మిక మరణంతో మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ లో ఇలాంటి దారుణం అయిన కామెంట్లు పోస్టు చేసిన వారి మీద సాటి ముస్లీం సోదరులు మండిపడుతున్నారు. మీ ఇంటిలో ఎవరైనా ఇలాగే చనిపోతే మీరు ఇలాంటి కామెంట్లు పోస్టు చేసి సంబరిపడిపోతారా అంటూ మంగళూరు ముస్లీ ఫేస్ బుక్ పేజ్ ఆడ్మిన్ ను ప్రశ్నిస్తున్నారు.

కామెంట్లు వైరల్

కామెంట్లు వైరల్

ఎవరైనా చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఓదార్చడానికి సోషల్ మీడియాను వేదికగా ఉపయోగించుకుని సంతాపం వ్యక్తం చేస్తారు. అయితే కేంద్ర మంత్రి, ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించిన ఓ సీనియర్ నాయకుడు అనారోగ్యంతో మరణిస్తే ఇలాంటి దారుణమైన కామెంట్లు చేశారని పలువురు మండిపడుతున్నారు. మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ లో పెట్టిన అభ్యంతరకర కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వరైల్ అయ్యాయి.

కఠిన చర్యలు

కఠిన చర్యలు

కేంద్ర మంత్రి అనంత్ కుమార్ ఆకస్మిక మరణంతో ఆయన్ను కించపరుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ముస్లీం సోదరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. మంగళూరు ముస్లీం ఫేస్ బుక్ పేజ్ అడ్మిన్ ను వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చెయ్యాలని పోలీసులకు మనవి చేస్తున్నారు.

English summary
Mangalore Muslim Facebook Page has posted a nonsense post about Ananth Kumar's death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X