బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Cooker bomb: భారత్ లో అఫ్గానిస్తాన్ చట్టం తీసుకురావాలని ప్లాన్, మొబైల్ లో 55 జీబీలో !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/మంగళూరు: మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు కేసులో అరెస్టు అయిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ గురించి రోజుకు ఒక విషయం బయటకు వస్తోంది. భారత్ లో అఫ్గనిస్తాన్ చట్టం తీసుకురావాలని షారిఖ్ ప్రయత్నించాడని వెలుగు చూడటం కలకలం రేపింది. మంగళూరులో కుక్కర్ బాంబు పేలిపోవడానికి ముందు కర్ణాటకలోని అటవి ప్రాంతంలో ట్రయల్ రన్ జరిగిందని, ఆడవిలో కుక్కర్ బాంబు పేలుడు జరిపారని ఆరోపణలు ఉన్నాయి. షారిఖ్ మొబైల్ లో వేల సంఖ్యలో జీహాదీ వీడియోలు ఉండటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు.

Romance: భర్తతో కాపురం, రాత్రికి ఎంజాయ్ చేద్దాం రాఅని ప్రియుడు ఫోన్, నువ్వెంత నీ బతుకెంత ?, నన్నే !

 మంగళూరులో ఎందుకు ?

మంగళూరులో ఎందుకు ?

ఇటీవల మంగళూరులో కుక్కర్ బాంబు ఆటోలో పేలిపోయి విషయం తెలిసిందే. అనుమానిత ఉగ్రవాది మోహమ్మద్ షారిఖ్ తో పాటు ఆటో డ్రైవర్ కు తీవ్రగాయాలైనాయి. అనుమానిత ఉగ్రవాది షారిఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండటంతో అతన్ని విచారణ చెయ్యడానికి పోలీసులకు కష్టం అయ్యింది. షారిఖ్ మంగళూరునే ఎందురు టార్గెట్ చేసుకున్నాడు ? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.

 భారత్ లో అఫ్గనిస్తాన్ చట్టం తీసుకురావాలి

భారత్ లో అఫ్గనిస్తాన్ చట్టం తీసుకురావాలి

అఫ్గనిస్తాన్ లో తాలిబన్లు షరియా చట్టం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తప్పు చేశారని ఆరోపిస్తూ తాలిబన్లు ప్రాణాలతో ఉన్న మనుషులను రాళ్లతో కొట్టి చంపేయడం, బతికుండగానే కాళ్లు, చేతులు నరికేయడం, తల నరకడం చేశారు. అఫ్గానిస్తాన్ లో ఉన్న షరియా చట్టం భారత్ లో వస్తు ఇక్కడి ముస్లీంలు ప్రశాంతంగా ఉంటారి షారిఖ్ కలలకన్నాడని మంగళూరు పోలీసుల విచారణలో వెలుగు చూసింది.

 బాంబు పేలుడు ట్రయల్

బాంబు పేలుడు ట్రయల్

మంగళూరులో జరిగిన కుక్కర్ బాంబు పేలుడు కేసులో అరెస్టు అయిన మోహమ్మద్ షారిఖ్ అలియాస్ షారిఖ్ గురించి రోజుకు ఒక విషయం బయటకు వస్తోంది. మంగళూరులో కుక్కర్ బాంబు పేలిపోవడానికి ముందు కర్ణాటకలోని చార్మాడిలో అటవి ప్రాంతంలో బాంబు పేలుడు జరిగిందని, ఆడవిలో కుక్కర్ బాంబు పేలుడు జరిపారని ఆరోపణలు ఉన్నాయి.

 నిజాలు బయటకు వస్తే ?

నిజాలు బయటకు వస్తే ?

చార్మాడి అటవి ప్రాంతంలో 8 రోజుల క్రితం కుక్కర్ బాంబు పేలుడు జరిగిదని, 8 రోజుల తరువాత మంగళూరులో బాంబు పేలుడు జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. అయితే దక్షిణ కన్నడ జిల్లా ఎస్పీతో పాటు పోలీసులు ఆ విషయాన్ని ఖండించారు. షారిఖ్ మొబైల్ లో వేల సంఖ్యలో జీహాదీ వీడియోలు ఉన్నాయని వెలుగు చూశాచి.

 మొబైల్ లో 55 జీబీ మెమరీలో అవే విషయాలు

మొబైల్ లో 55 జీబీ మెమరీలో అవే విషయాలు

ఫోటోలు ఉన్నాయని, 55 జీబీ కంటే ఎక్కువగా ఇలాంటి వీడియోలు ఉన్నాయని పోలీసు అధికారులు అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. షారిఖ్ ఫోన్ లో ఇలాంటి వీడియోలు ఉండటంతో పోలీసులు అనేక కోణాల్లో విచారణ ముమ్మరం చేశారు. మొత్తం మీద షారిఖ్ కొలుకున్న తరువాత నిజానిజాలు వెలుగు చూస్తాయని ఓ పోలీసు అధికారి అంటున్నారు.

English summary
Mangaluru cooker bomb blast case: Shariq wanted to enforce Sharia law in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X