మానిక్ సాహా వద్దు.. బిప్లవ్ కంటిన్యూ చేయండి.. ఎమ్మెల్యేల నిరసన
త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఏడాది ముందు కీలక పరణామం చోటుచేసుకుంది. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం వద్దని వారించారు. బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలోనే బిప్లవ్ తన రాజీనామా గురించి ప్రకటన చేశారు. కొత్త సీఎంకు సపోర్ట్ చేస్తామని తెలిపారు. ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపించారు.
మంత్రి రామ్ ప్రసాద్ పాల్ అభ్యంతరం తెలిపారు. ఎమ్మెల్యేలు సహనం కోల్పోయారు. పాల్ కూడా చైర్లను విసిరేశారు. కింద కూర్చి పడుతున్న వీడియో స్పష్టంగా కనిపించింది. తమను సంప్రదించకుండానే సీఎంను ప్రకటించారని మరికొందరు అంటున్నారు. పరిశీలకులుగా సీనియర్ నేత భూపేందర్ యాదవ్, వినోద్ తౌడే రాగా.. ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు.

త్రిపుర సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ రాజీనామాతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. అయితే బీజేపీ హైకమాండ్ మానిక్ సహాకు సీఎం పగ్గాలు అప్పగించింది. ఆయన త్రిపుర బీజేపీ చీఫ్, రాజ్యసభ ఎంపీగా కూడా ఉన్నారు. మధ్యాహ్నం సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ తన పదవీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. మానిక్ సాహా 2016లో కాంగ్రెస్ పార్టీని వీడారు. 2020లో బీజేపీ త్రిపుర రాష్ట్ర శాఖ పగ్గాలు చేపట్టారు. గతేడాది నవంబర్లో జరిగిన 13 స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించింది. ఇందులో సాహా కీలక పాత్ర పోషించారు. అందుకే సీఎం పదవీని కట్టబెట్టారు.