వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాణిక్ సర్కార్! బెంగాల్, కేరళ లేదా బంగ్లాదేశ్‌కో వెళ్లిపో!!: బీజేపీ విసుర్లు

|
Google Oneindia TeluguNews

అగర్తాలా: త్రిపురలో బీజేపీ కూటమి ఘన విజయం నేపథ్యంలో సీపీఎం నేత, ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ పైన బీజేపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. మాణిక్ సర్కార్ రాష్ట్రాన్ని విడిచి పెట్టి వెళ్లిపోవడం ఉత్తమం అంటూ బీజేపీ నేత హిమంత బిస్వా ఎద్దేవా చేశారు.

Recommended Video

Tripura Election Results : BJP Stops Left's 20-Year Run

సీన్ రివర్స్: కనీసం డిపాజిట్ కూడా రాలేదు! మేఘాలయపై బీజేపీ వ్యూహం, కాంగ్రెస్ అప్రమత్తంసీన్ రివర్స్: కనీసం డిపాజిట్ కూడా రాలేదు! మేఘాలయపై బీజేపీ వ్యూహం, కాంగ్రెస్ అప్రమత్తం

శనివారం అగర్తాలాలో జరిగిన బీజేపీ విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. మాణిక్ సర్కార్ ఇక ఎక్కడికైనా వెళ్లాలని, కావాలంటే పశ్చిమ బెంగాల్, కేరళ లేదా పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌కు వెళ్లవచ్చునని చెప్పారు.

మాణిక్ సర్కార్ ముందు మూడు మార్గాలు

మాణిక్ సర్కార్ ముందు మూడు మార్గాలు

ప్రస్తుతం మాణిక్ సర్కార్ ముందు మూడు మార్గాలు మాత్రమే ఉన్నాయని హిమంత్ బిస్వా అన్నారు. ఎంచుకునే అవకాశాన్ని కూడా ఆయనకే ఇస్తున్నామని చెప్పారు. ఎన్నికల తర్వాత మాణిక్‌ను బంగ్లాకు పంపుతామని ఇంతకుముందే వ్యాఖ్యానించారు.

 ఎక్కడకైనా వెళ్లవచ్చు

ఎక్కడకైనా వెళ్లవచ్చు

పశ్చిమ బెంగాల్‌లో ఆ పార్టీ కొంత ఉందని, కేరళలో అధికారంలో ఉందని అందుకే అక్కడకు మాణిక్ సర్కార్ వెళ్లవచ్చునని హిమంత అన్నారు. త్రిపుర ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.

 మోడీ ఆలోచనలు యంగ్ తరంగ్

మోడీ ఆలోచనలు యంగ్ తరంగ్

త్రిపుర బీజేపీ చీఫ్, సీఎం రేసులో ఉన్న బిప్లవ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అభ్యర్థిని పార్టీ నిర్ణయిస్తుందని చెప్పారు. ప్రధాని మోడీ వెంట్రుకలు మాత్రమే గ్రే కలర్ అని, ఆలోచనలు అన్నీ యువతరానికి ఉన్నట్లుగా ఉంటాయన్నారు.

బీజేపీకి వాస్తు కలిసి వచ్చిందా

బీజేపీకి వాస్తు కలిసి వచ్చిందా

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ శాసన సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని నింపాయి. త్రిపురలో సంపూర్ణ ఆధిక్యత సాధించగా, నాగాలాండులో మిత్రపక్షంతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. మేఘాలయలో కాంగ్రెస్‌ను బాగా వెనుక్కి నెట్టింది. కాంగ్రెస్సేతర ప్రభుత్వాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. బీజేపీ గెలుపుకు కొత్త పార్టీ కార్యాలయం కలిసి వచ్చిందని ఆ పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట. బీజేపీ నూతన ప్రధాన కార్యాలయాన్ని ఢిల్లీలోని దీన దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో నిర్మించారు. గత నెల 18వ తేదీన ప్రారంభించారు. అయితే మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీజేపీ వరుసగా రాష్ట్రాలను గెలుచుకుంటూ వస్తోంది.

English summary
Himanta Biswa Sarma, BJP's main strategist in the northeast, has suggested that Manik Sarkar, who will soon be resigning from Tripura chief minister's post, can seek shelter either in West Bengal, neighbouring Bangladesh or the southern state of Kerala. The BJP stormed Tripura today and dethroned Manik Sarkar-led Left government that has been in power for more than two decades.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X