వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెల్మెట్ ధరించని వాహనదారులకు స్వీట్లు పంపిణీ: ఎక్కడో తెలుసా?

|
Google Oneindia TeluguNews

ఇంఫాల్: మణిపూర్ రాష్ట్రానికి చెందిన పోలీసులు వాహనదారుల పట్ల సరికొత్త రీతిలో వ్యవహరిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనదారులకు భారీ జరిమానాలు వేయకుండా స్వీట్లు పంపిణీ చేస్తున్నారు. ఇలా స్వీట్లు పంపిణీ చేస్తూనే వాహనదారులకు సేఫ్టీపై సూచనలు చేస్తున్నారు చురచంద్‌పూర్ ట్రాఫిక్ పోలీసులు.

ట్రాఫిక్ రాల్స్ ఉల్లంఘిస్తే వాతలే: నేటి నుంచే భారీ జరిమానాలు అమలు ఇలా, కానీ..ట్రాఫిక్ రాల్స్ ఉల్లంఘిస్తే వాతలే: నేటి నుంచే భారీ జరిమానాలు అమలు ఇలా, కానీ..

సేఫ్టీ డ్రైవ్ పేరుతో..

సేఫ్టీ డ్రైవ్ పేరుతో..

ఈ సేఫ్టీ డ్రైవ్ ప్రచారానికి ఎస్పీ అమృత సిన్హా నేతృత్వం వహిస్తున్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా ప్రయాణాలు చేస్తే కలిగే నష్టాల గురించి వారికి వివరిస్తున్నారు. హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారుల కోసమే ఈ సేఫ్టీ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ అమృత ఏఎన్ఐకి తెలిపారు. కొందరు హెల్మెట్ ఇంటి దగ్గరే పెట్టి మర్చిపోతున్నారని, మరికొందరు వాహనంలోనే పెట్టుకుని తలకు పెట్టుకోవడం లేదని ఆమె చెప్పారు.

వాహనదారులను ఆపి స్వీట్లు..

వాహనదారులను ఆపి స్వీట్లు..

హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపేవారిని ఆపి.. వారికి స్వీట్లు ఇచ్చి, సేఫ్టీ సూచనలు చేస్తున్నామని ఎస్పీ అమృత తెలిపారు. గత కొన్ని రోజులుగా చుచంద్‌పూర్ పట్టణంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ డ్రైవ్ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

మార్పు కోసమే..

మార్పు కోసమే..


జరిమానాలు వాహనదారుల్లో మార్పు తీసుకురావడం లేదని, అందుకే ఇలాంటి నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎస్పీ అమృత చెబుతున్నారు. హెల్మెట్ పెట్టుకోవడం వల్ల వాహనదారులు ప్రమాదానికి గురైనప్పటికీ స్వల్ప గాయాలతోనే బయటపడవచ్చునని, లేదంటే ప్రాణాలే పోయే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రజల నుంచి మంచి స్పందన

ప్రజల నుంచి మంచి స్పందన

కాగా, పోలీసులు చేస్తున్న ఈ పనిపై స్థానికుల నుంచి మంచి స్పందన వస్తోంది. పోలీసులు ప్రజల కోసం ఇలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వాహనదారుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. స్వీట్లు తీసుకోవడం వల్ల తనకు హెల్మెట్ విషయం ఎప్పుడూ గుర్తుంటోందని పాయా సౌంతక్ అనే వ్యక్తి తెలిపారు.

English summary
Contrary to the common practice of imposing fine to helmetless riders, Traffic Control Police personnel in Churachandpur distributed sweets to riders without helmets and counselled them on safety tips.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X