వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మణిపూర్ బలపరీక్షలో బీజేపీ విజయం - మూజువాణితో బీరేన్ సేఫ్ - స్పీకర్‌పైకి కుర్చీలు విసిరిన కాంగ్రెస్

|
Google Oneindia TeluguNews

మణిపూర్ అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా సోమవారం భారీ రచ్చ చోటుచేసుకుంది. తామిచ్చిన తీర్మానంపై కాకుండా, అధికార పక్షం కోరిన విధంగా విశ్వాసపరీక్ష నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సభలో హంగామా చేశారు. స్పీకర్ కేమ్ చంద్ సింగ్ పోడియంపైకి కుర్చీలు విసిరేసి గలాటా సృష్టించారు. ఆ గందరగోళం మధ్యలోనే మూజువాణి ఓటు ద్వారా నిర్వహించిన బలపరీక్షలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం విజయం సాధించినట్లు స్పీకర్ ప్రకటించారు.

పిలిచి అన్నం పెడితే.. కెలికి కయ్యమా? - జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మోదీపైనా ఫైర్పిలిచి అన్నం పెడితే.. కెలికి కయ్యమా? - జగన్ పై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు - మోదీపైనా ఫైర్

''విశ్వాస పరీక్షలో మేమే గెలిచాం. స్పీకర్ అడుగడుగునా రూల్స్ ప్రకారమే వ్యవహరించారు. మెజార్టీ ఎమ్మెల్యేలు మా వైపే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కు సరిపడా బలం లేదు''అని బలపరీక్షలో గెలుపొందిన అనంతరం సీఎం బీరేన్ సింగ్ మీడియాతో అన్నారు. విశ్వాసపరీక్షలో విజయం సాధించిన ఆయనకు ఈశాన్య రాష్ట్రాల బీజేపీ ఇన్ చార్జి రాంమాధవ్ అభినందనలు తెలిపారు.

Manipur crisis: BJP-led govt wins trust vote, congress mlas threw chairs at Speaker

మొత్తం 60 మంది స‌భ్యులున్న మ‌ణిపూర్ అసెంబ్లీలో బీజేపీ నేతృత్వంలోని కూటమికి 35 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. అందులో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నుంచి 4, నాగా పీపుల్స్ ఫ్రంట్(ఎన్‌పీఎఫ్) నుంచి 4, ఎల్జేపీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో 18 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అధికార కూటమిలో గొడవలే బపరీక్ష పరిస్థితులకు దారి తీశాయి.

ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌: గుడ్‌న్యూస్ - 2020లోనే వస్తుందన్న సీరం సీఈవో - ఫైనల్ ధర ఎంతంటే..ఆక్స్‌ఫర్డ్ కరోనా వ్యాక్సిన్‌: గుడ్‌న్యూస్ - 2020లోనే వస్తుందన్న సీరం సీఈవో - ఫైనల్ ధర ఎంతంటే..

Manipur crisis: BJP-led govt wins trust vote, congress mlas threw chairs at Speaker

Recommended Video

రానున్న 24 గంట‌ల్లో ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాల || IMD Warns Of Heavy Rainfall In Several States

బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్ర‌భుత్వానికి జూన్ 14న ఆరుగురు ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఉప‌సంహ‌రించుకుని కాంగ్రెస్ లో చేరారు. వాళ్లలో ముగ్గురు బీజేపీ, ముగ్గురు ఎన్‌పీపీ ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్షకు కాంగ్రెస్ డిమాండ్ చేసేలోపే.. ఎన్‌పీపీ అధినేత సంగ్మా(మేఘాలయ సీఎం) జోక్యంతో ఎమ్మెల్యేలు తిరిగి బీజేపీ కూటమిలో చేరారు. ఏది ఏమైనా బలపరీక్ష నిర్వహించాల్సిందేనంటూ కాంగ్రెస్ పార్టీ జులై 28న స్పీకర్ కు తీర్మానం పంపింది. కానీ దాన్నాయన స్వీకరించలేదు. బలపరీక్ష నిర్వహించాలంటూ ప్రభుత్వమే కోరడంతో ఆ మేరకు సోమవారం డేట్ ఫిక్స్ చేశారు. తమ తీర్మానంపై కాకుండా ఏకపక్షంగా నిర్వహించిన బలపరీక్ష అక్రమమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాదిస్తున్నారు.

English summary
Aday of ruckus in Manipur Assembly ended in triumph for the BJP-led coalition government as CM N Biren Singh won the vote of confidence. The opposition congress leaders staged a protest against the Speaker and threw chairs at him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X