Manipur Polls: 60 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా రిలీజ్, హేంగ్యాంగ్ నుంచి సీఎం బీరేన్
న్యూఢిల్లీ: మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు మరి కొద్ది వారాల్లో జరుగనుండగా.. రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ 60 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఎన్ బీరేన్ సింగ్.. హేంగ్యాంగ్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు.
ఎన్నికలకు ముందు మిత్రపక్షం మారకుండా నిరోధించే ప్రయత్నంలో భాగంగా గతంలో రాబోయే మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అనేక పార్టీ సభ్యులతో బీజేపీ సహకార ఒప్పందంపై సంతకం చేసినట్లు తెలిసింది.

"అభివృద్ధి చెందుతున్న రాజకీయ దృష్టాంతంలో పార్టీలు మారకుండా ఉండటానికి ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ సమక్షంలో చాలా మంది సంభావ్య అభ్యర్థులతో పార్టీ సహకార ఒప్పందంపై సంతకం చేసింది" అని రాష్ట్రంలో బీజేపీ ధాన అధికార ప్రతినిధి సిహెచ్ బిజోయ్ పీటీఐ వార్తా సంస్థతో అన్నారు.
ఎన్నికలలో
పోటీకి
దింపేందుకు,
సభ్యుల
మధ్య
సత్సంబంధాలు,
సహకారాన్ని
నిర్ధారించడానికి
కాషాయ
పార్టీ
సున్నితత్వ
సమావేశాలను
నిర్వహించిందని
చెప్పారు.
కాగా,
2017లో
మణిపూర్‌లో
28
సీట్లు
సాధించిన
కాంగ్రెస్‌తో
పోలిస్తే
బీజేపీ
కేవలం
21
సీట్లు
సాధించినప్పటికీ
ప్రభుత్వాన్ని
ఏర్పాటు
చేసింది.
కాషాయ పార్టీ రెండు స్థానిక సంస్థలు ఎన్పీపీ, ఎన్‌పీఎఫ్‌లతో చేతులు కలపడం ద్వారా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి కొందరు ఎమ్మెల్యేలు ఫిరాయించడంతో బీజేపీ సొంత బలం 30కి పెరిగింది.
BJP announces candidates for all 60 Assembly seats in Manipur, CM N Biren Singh to contest from Heingang constituency
— ANI (@ANI) January 30, 2022
(File photo) pic.twitter.com/XF0HoESeye
మణిపూర్‌లోని 60 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. నాలుగు ఇతర రాష్ట్రాలతో పాటు ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది. మణిపూర్ తోపాటు ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
బీజేపీ ఒంటరిగా పోటీ చేయడం, 60 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించిన నేపథ్యంలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్ దక్కన అభ్యర్థులు బీజేపీ పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళన చేపడుతున్నారు.ద ీంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది.